Andhra King Taluka OTT: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:16 PM
రామ్ పోతినేని(RAM), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఓటీటీలో (OTT) విడుదలకు సిద్ధమైంది
రామ్ పోతినేని(RAM), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). ఓ అభిమాని కథగా ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకుడు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఓటీటీలో (OTT) విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.
కథ:
సాగర్ (రామ్ పోతినేని) చిన్నప్పటి నుండి హీరో సూర్య కుమార్ (ఉపేంద్ర) ఫ్యాన్. అతని తెర మీద పాత్రలను తనకు తాను అన్వయించుకుంటూ, చిన్నప్పటి నుండి ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటాడు. సూర్య కుమార్ ను ఎవరైనా ఏమైనా అంటే చాలా వారితో గొడవ పడిపోతాడు. తన హీరోకు అచ్చి వచ్చిన మహాలక్ష్మీ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మీ (భాగ్యశ్రీ బోర్సే)ని సాగర్ ప్రేమిస్తాడు. అతడిని, అతను ఉండే లంక గ్రామాన్ని, అక్కడి మట్టిని అవమానించాడనే కోపంతో మహాలక్ష్మీ తండ్రికి సాగర్ సవాల్ విసురుతాడు. తన ఊరిలోనే మహాలక్ష్మీ పేరుతోనే ఓ కొత్త డీటీఎస్ థియేటర్ ను కట్టి, అందులో సూర్య కుమార్ నటించిన వందో సినిమాను ప్రదర్శిస్తానని చెబుతాడు. మరో వైపు వరుస పరాజయాల కారణంగా సూర్య కుమార్ వందో సినిమా మధ్యలో ఆగిపోతుంది. మరి సాగర్ అభిమానించే సూర్య వందో సినిమా పూర్తి చేశాడా? దిగువ మధ్య తరగతికి చెందిన సాగర్ తన లంక గ్రామంలో సినిమా థియేటర్ కట్టి మహాలక్ష్మీని పెళ్ళి చేసుకున్నాడా? సాగర్ ముక్కుముఖం కూడా తెలియని సూర్యకుమార్... అతన్ని వెతుక్కుంటూ ఆ లంక గ్రామానికి ఎందుకెళ్ళాడు? ఈ ప్రయాణంలో తనని తాను ఎలా తెలుసుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.