Alappuzha Gymkhana: ‘అలప్పుజ జింఖానా’ ఓటీటీలో ఎప్పుడంటే..
ABN , Publish Date - Jun 06 , 2025 | 09:17 PM
మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana) ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది.
మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana) ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. ‘సోనీలివ్’ (SonyLiv)ఓటీటీలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అందుబాటులో ఉండనుంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, లక్మన్ అవరన్, సందీప్ ప్రదీప్, అనఘ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో ఖలీద్ రెహమాన్ తెరకెక్కించిన చిత్రమిది. బాక్సింగ్ ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళం బాక్సాఫీసు ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న తెలుగులో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది.
కథ:
అల్లెపీకి చెందిన ఆకతాయి కుర్రాళ్లు.. జోజో జాన్సన్ (నస్లేన్), డీజే జాన్ (బేబీ జీన్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షణవాస్ (శివ హరిచరణ్), దీపక్ ఫణిక్కర్ (గణపతి). వీరిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. దాంతో, స్పోర్ట్స్ కోటా ద్వారా అడ్మిషన్ సాధించేందుకు బాక్సింగ్‌ను నేర్చుకోవాలనుకుంటారు. అలా స్థానికంగా ఉన్న ‘అలప్పుజ జింఖానా’ అకాడమీలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఈ గ్యాంగ్‌కు ఆంటోనీ జోషువా (లక్మన్ అవరన్) కోచ్‌గా వ్యవహరిస్తాడు. అతడి శిక్షణలో.. స్థానిక బాక్సింగ్ పోటీల్లో గెలిచిన జోజో జాన్సన్ గ్యాంగ్.. ఆ తర్వాత కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది. అయితే, ఎంతో ప్రొఫెషనల్ ఆటగాళ్లు పోటీపడే ఆ బాక్సింగ్‌లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆ ప్రయాణంలో వాళ్లు ఏం నేర్చుకున్నారు?స్టేట్ బాక్సింగ్ పోటీల్లో గెలిచారా? అన్నది మిగిలిన కథ.