Kesari Chapter 2 OTT: ఓటీటీకి కేసరి2.. ఎందులో చూడొచ్చంటే!
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:31 PM
రెండు నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ టాక్‌తో విజయం సాధించిన చిత్రం కేసరి ఛాప్టర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
రెండు నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ టాక్‌తో విజయం సాధించిన చిత్రం కేసరి ఛాప్టర్ 2 (Kesari Chapter 2). మిస్టారికల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఇన్నాళ్లకు సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar), మాదవన్ (R. Madhavan), అనన్యా పాండే Ananya Panday) కీలక పాత్రల్లో నటించగా కరణ్ త్యాగ్ (Karan Singh Tyagi) రచించి దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) బ్యానర్‌పై కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. బ్రిటీష్ హాయాంలో 1919లో జరిగిన దారుణ దుర్మార్గ మారణ కాండకు మూల కారకుడైన అప్పటి పంజాబ్ జనరల్ మైఖైల్ ఓ డ్వేయర్ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఆ క్రమంలో తమకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని కోరుతూ ఆ సమయంలో వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడు అడ్వకేట్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)ను కోరుతాడు. కానీ విషయం తెలుసుకున్న శంకరన్ నాయర్ ససేమిరా అని అక్కడ తన పదవికి రాజీనామా చేసి డయ్యర్‌పైనే కేసు వేస్తాడు. ఈ నేపథ్యంలో డ్వేయర్ మరో ప్రముఖ అడ్వకేట్ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్.మాధవన్)ని తీసుకు వస్తారు. దీంతో కేసు రసవత్తరంగా మారుతుంది.
ఈ క్రమంలో శంకర్ నాయర్, మెక్‌కిన్లేల మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి, నాటి దురాగతాన్ని ఎలా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. చివరకు కథ ఎన్ని మలుపులు తిరిగిందనే కథకథనాల చుట్టూ సినిమా సాగుతూ చూసే ప్రతి ఒక్కరినీ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను కళ్లకు కట్టినట్లు చూయించారు. ప్రతిఒక్కరు తమ కంటచెమ్మ రాల్చుతూ థియేటర్ నుంచి బయటకు వెళ్లారంటే ఈ మూవీ ఆడియెన్స్ పై ఎవంతలా ప్రభావం చూయించిందో ఇట్లే అర్థమవుతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవనుంది. సో ఇప్పటి వరకు ఈ సినిమా చూడలేక పోయిన వారు ఇప్పుడు మిస్ అవకుండా ఫ్యామిలీతో కలిసి ముఖ్యంగా పిల్లలకు నాటి ఘటనను తెలియజేస్తూ మూవీ చూడొచ్చు.