Good Bad Ugly OTT: అప్పుడే ఓటీటీకి.. అజిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్! ఎందులో.. ఎప్పటి నుంచంటే? ఇప్పుడైనా చూస్తారా!
ABN, Publish Date - May 03 , 2025 | 03:50 PM
గత నెలలో థియేటర్లలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా నటించిన ఈ చిత్రానికి విశాల్‌కు మార్క్ అంటోని వంటి బ్లాక్ బస్టర్ అందించిన అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)దర్వకత్వం వహించగా ప్రముఖ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. త్రిష (Trisha)కథానాయికగా నటించింది. తెలుగు కమెడియన్ సునీల్, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) కీలక పాత్రలు చేశారు. ఏప్రిల్ 10న ప్రపపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళ నాట బంపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ (Ott) కి వచ్చేందుకు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. పెద్ద అండర్ వరల్డ్ డాన్ అయిన ఎ.కె. ఫ్యామిలీ కోసం కొన్ని నేరాలపై అరెస్ట్ అయి చాలా కాలంగా జైల్లో ఉంటాడు. భార్య ఆ విషయాలేవి కుమారుడు విహాన్‌కు తెలియకుండా దాచి పెడుతుంది. ఓ రోజు విహాన్ తండ్రిని చూడాల్సిందే అని బలవంతం చేయడంతో జైల్లో ఉన్న ఏకే కుటుంబాన్ని కలవడం కోసం బయట ఇ ప్రపంచంలో అడుగు పెడతాడు. ఇదే అదునుగా భావించిన ఇతర గ్యాంగులు అప్రమత్తమై ఏకే ఫ్యామిలీని టార్గెట్ చేయగా ఏకే కుమారుడు విహాన్ వాల్లుకు చిక్కుతాడు. ఈ నేపథ్యంలో ఏకే అవతలి గ్యాంగ్స్ నుంచి కుమారుడిని, ఫ్యామిఈని ఎలా రక్షించుకున్నాడు, నాత కక్షలు ఎలా తీర్చుకున్నాడనే కత కథనాలతో ఈ సినిమా సాగుతుంది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ తెలుగు నాట ఘోర పరాజయం చవిచూడగా తమిళనాట మాత్రం ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇన్నాళ్లు అజిత్‌ను ఎలా చూడాలనుకున్నామో ఆ కోరికి తీరిందని, సినిమాతో డైరెక్టర్ ఫుల్ మీల్స్ పెట్టాడని సంబురాలు సైతం చేసుకున్నారు. అలాంటి ఈ సినిమా థియేటర్లలో రిలీజై నెల కూడా పూర్తి కాక ముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ముందస్తుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏప్రిల్8 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (Ott) లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఎవరైతే థియేటర్లలో మిస్సయ్యారో, మంచి యాక్షన్ సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమాను హాయిగా చూసేయవచ్చు. కాకుంటే కొన్ని సన్నివేశాలలో రొటీన్ అతి అరవ భాషను అనుభవించాల్సి ఉంటుంది.