scorecardresearch

Karthika Missing Case OTT: మూడేండ్ల త‌ర్వాత.. తెలుగులో ఓటీటీకి త‌మిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:43 PM

మూడేండ్ల క్రితం విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకున్న త‌మిళ , మ‌ల‌యాళ ద్విభాష మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం యుగి

Karthika Missing Case OTT: మూడేండ్ల త‌ర్వాత.. తెలుగులో ఓటీటీకి త‌మిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్
yugi

మూడేండ్ల క్రితం 2022లో విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకున్న త‌మిళ , మ‌ల‌యాళ ద్విభాష మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం యుగి (Yugi). ఇప్పుడీ సినిమాను కార్తిక-మిస్సింగ్ కేస్ (KarthikaMissingCase) అనే పేరుతో తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు. క‌థిర్ (Kathir), ఆనంది, న‌రేన్ (Narain), జోజు జార్జ్ (Joju George) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా జాక్ హారిస్ (Zac Harriss) దర్శకత్వం వ‌హించాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. సినిమా ఆరంభ‌మే కార్తీక ఏడ్చుకుంటూ రోడ్డ దాటుతుండ‌గా మిస్స‌వుతుంది. ఆ వెంట‌నే ఓ హ‌త్య కూడా జ‌రుగుతుంది. దాంతో పోలీసులు ఈ కేసును ఓ డిటెక్టివ్‌కుఅప్ప‌గించ‌డంతో కేసు ఇన్వెస్టిగేష‌న్ మొద‌ల‌వుతుంది. ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతున్న క్ర‌మంలో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి.

GtOdFSxbMAYorIW.jpg

అయితే రివేంజ్ డ్రామా, ఇన్వెస్టిగేష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా స్టార్టింగ్‌లో కాస్త నిదానంగా అనిపించిన ఆపై మంచి థ్రిల్లింగ్ అంశాల‌తో , ట్విస్టుల‌తో సాగుతూ చూసే వారికి మంచి హై ఇస్తుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌. ఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటీటీ (Aha OTT)లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి థ్రిల్ల‌ర్ చూడాల‌నుకునే వారు ఒక మారు ఈ కార్తిక-మిస్సింగ్ కేస్ (KarthikaMissingCase) మూవీని ట్రై చేయ‌వ‌చ్చు.

Updated Date - Jun 13 , 2025 | 01:43 PM