Bun Butter Jam OTT: రిలీజైన.. వారానికే ఓటీటీకి వ‌చ్చేసిన రొమాంటిక్ కామెడీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 08:01 PM

తమిళంలో రిలీజై మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం బ‌న్ బ‌ట్ట‌ర్ జామ్

Bun Butter Jam

గ‌త నెల‌లో తమిళంలో రిలీజై మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం బ‌న్ బ‌ట్ట‌ర్ జామ్ (Bun Butter Jam). ఘవ్ మిర్ధాత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీలో రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన తారాగణం కాగా విక్రాంత్, శరణ్య, దేవదర్శిని, ఛార్లీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను ఆగ‌స్టు22న తెలుగులోనూ తీసుకు వ‌చ్చారు. ట్రైల‌ర్‌, పాట‌లు అల‌రించేలా ఉన్నా ప్ర‌చార లోపం వ‌ల్ల జ‌నాల‌కు రీచ్ అవ‌లేదు. స‌డ‌న్‌గా ఇప్పుడు సినిమా వ‌చ్చి వారానికే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చి మేక‌ర్స్ షాకిచ్చారు.

కథ విష‌యానికి వ‌స్తే..లలిత (శరణ్య), ఉమ (దేవదర్శిని) ఇద్దరూ ప‌క్క‌ప‌క్క‌నే త‌మ త‌మ కుటుంబాల‌తో హాయిగా కాలం వెళ్ల‌దీస్తుంటారు. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో ప్రేమ వివాహాలు, పెద్ద‌లు కుదిర్చిన వివాహాలు ఏవి నిల‌బ‌డ‌డం లేద‌ని భావించిన వారు ల‌లిత త‌న కుమారుడు చంద్రుని, ఉమ త‌న కూతురు మ‌ధుమితల‌ను దగ్గర చేయాలనుకుంటారు. కానీ లలిత కుమారుడు చంద్రు తన క్లాస్మేట్ నందిని (భవ్య త్రిఖ)పై మనసు పడతాడు. ఇదే సమయంలో నందినిపై మరో యువకుడు శ్రీనివాస్ (మైఖేల్) కూడా ప్రేమలో పడతాడు. మరో వైపు మధుమిత ఆకాశ్ (వీజే పప్పు)తో లవ్ ట్రాక్ కొనసాగుతుంది. చివరికి ఈ ప్రేమకథలు ఎలాంటి మలుపులు తిరిగాయి? హీరో తల్లులు వేసిన ప్లాన్ ఫలించిందా? అనేదే కథ.

Bun Butter Jam

ఈ సినిమా ప్రధానంగా ప్రేమ,స్నేహం,పెళ్లి అనే మూడు పాయింట్లను ప్ర‌ధానంగా హైలెట్ చేస్తూ క‌థ న‌డుస్తుంది. మొదటి భాగం యూత్‌ఫుల్ లవ్ ట్రాక్‌లతో సరదా స‌ర‌దాగా సాగిపోతూ హీరోహీరోయిన్ల తల్లుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలతో బాగా న‌వ్విస్తారు. ఇక సెకండాఫ్ నుంచి క‌థ ట‌ర్న్ తీసుకుని పూర్తి ఎమోష‌న్ల్ డ్రామాగామారుతుంది. స్నేహం, నిజమైన ప్రేమల మ‌ధ్య తేడాను దర్శకుడు అర్థ‌మ‌య్యేలా చూపించాడు. “ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? తిరిగి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి?” అనే ప్రశ్నల‌కు సమాధానం చెప్పే విధానం కూడా ఆక‌ట్ట‌కుంటుంది.

అక్క‌డ‌క్క‌డ సినిమా లాగ్ అనిపించ‌డం, పాట‌లు కాస్త ఇబ్బంది పెడుతాయి. ఈ జనరేషన్‌కు దగ్గరగా ఉన్న ఈ సినిమా ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా మ‌య‌టి దేశాల్లో మాత్ర‌మే అదుబాటులో ఉంది. మ‌రో రెండు మూడు రోజుల్లో ఇండియాలోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. అయితే ఈ లోపే ఈ బ‌న్ బ‌ట్ట‌ర్ జామ్ (Bun Butter Jam) చిత్రం మ‌న దేశంలో ప్రీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి వ‌చ్చేసింది.

Updated Date - Sep 04 , 2025 | 08:01 PM