Amazon Prime Video: ఓటీటీ లవర్స్‌కు షాక్.. బాంబు పేల్చిన అమోజాన్ ప్రైమ్ వీడియో!
ABN, Publish Date - May 13 , 2025 | 03:50 PM
భారతీయ ప్రేక్షకులను భారీ కంటెంట్, లెక్కకు మించి జాతీయ, అంతర్జాతీయ సిరీస్‌లు, సినిమాలను ప్రతి ఇంటిలోకి తీసుకువచ్చి అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు దక్కించుకున్న ఏకైక డిజిటల్ ఫ్లాట్‌ఫాం అమోజాన్ ప్రైమ్ వీడియో
ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులను భారీ కంటెంట్, లెక్కకు మించి జాతీయ, అంతర్జాతీయ సిరీస్‌లు, సినిమాలను ప్రతి ఇంటిలోకి తీసుకువచ్చి అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు దక్కించుకున్న ఏకైక డిజిటల్ ఫ్లాట్‌ఫాం అమోజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Membership). దానికి ముందు దాని తక్వాత అనేక ఓటీటీలు వచ్చినా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. కరోనా రాక మునుపు వార్షిక రుసుము కేవలం రూ.300తో మైదలైన ఈ ఓటీటీ ఆ తర్వాత రూ. 500, ఆపై ఇప్పుడు రూ.1500కు చేరింది అయినా వీటికి బాగా అలవాడు పడిన కుటుంబాలు ఇంటి రోజు వారి ఖర్చులో రూ.500 తగ్గించుకుంటున్నారు గానీ అమెజాన్ సబ్‌స్క్రిప్సన్ లేకుండా అయితే ఉండడం లేదు. అంతగా మన జనం అడిక్ట్ అయిపోయారు.
అయితే తాజాగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకుల నెత్తిన ఓ బాంబ్ వేయడానికి సిద్ధమైంది. రానున్న జూన్ 17 2025 నుంచి ప్రతి సీరీస్, సినిమాల మధ్యలో ప్రకటనలు టెలికాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లెటర్ సైతం విడుదల చేసి తమ పాలసీలో మార్పులు జరిగినట్లు తెలిపి ఈ క్రింది వివరాలు వెల్లడించారు. ‘ప్రియమైన ప్రైమ్ మెంబర్.. జూన్ 17, 2025 నుంచి, ప్రైమ్ వీడియో సినిమాలు మరియు టీవీ షోలలో పరిమిత ప్రకటనలు ఉంటాయి. తద్వారా వచ్చే ఆదాయంతో మిమ్మల్ని మరింతగా అలరించే, ఆకట్టుకునే మంచి కంటెంట్ అందించడానికి దోహదం చేస్తుందని తెలిపారు.
ఈ ప్రకటనలు కూడా చాలా TV ఛానెల్‌లు, ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలలో కన్నా తక్కువ సమయమే ఉంటాయని స్పష్టం చేసింది. ఇందుకు మీరు కొత్తగా చేయాల్సి పనేమి లేదని, ప్రస్తుత మీ ప్రైమ్ మెంబర్‌షిప్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. అయితే యాడ్ ఫ్రీ కంటెంట్ చూడాలంటే అదనంగా నెలకు రూ.129, సంవత్సరానికైతే రూ.699 లేదా చెల్లించాల్సి’ ఉంటుందన్నారు. దీంతో ఇప్పటికే ఉన్న రూ.1500 సబ్‌స్క్రిప్సన్ కు ఇప్పుడు అదనంగా రూ.700 తోడవుతుండడంతో మొత్తంగా ఏడాది మెంబర్‌షిప్ కాస్ట్ రూ.2300 అవనుంది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ మినహా అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో ప్రకటనలు వస్తుండగా ఇప్పుడు ఆ లిస్టులో అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం చేరనుండడంతో దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ తన గోతి తానే తీసుకుంటున్నదని ఇప్పటికే సంవత్సరానికి రూ.1500 ప్లస్ టాక్స్ తీసుకుంటున్న అమెజాన్ ఇప్పుడు సడన్‌గా యాడ్స్ ఇవ్వడం వినియోగ దారులను చీట్ చేసినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక యాడ్స్ ఫ్రీ కంటెంట్ కోసం అదనంగా ఏడాదికి రూ. 699 చెల్లించాలనడం అమోదయోగ్యమైన విషయం కాదని అన్నారు. ఇలానే చేస్తే థర్డ్ పార్టీ ఫ్లాట్‌ఫాంల వైపు మళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.