Tuk Tuk Movie: ఓటీటీలో.. 'టుక్ టుక్' సంచలనం! చిన్న చిత్రం అరుదైన ఫీట్
ABN, Publish Date - May 04 , 2025 | 12:22 PM
మార్చి నెలలో చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం టుక్ టుక్. ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు, ఓ స్కూటర్ చుట్టు నడిచే కథతో వచ్చిన ఈ మూవీ ఆపై డిటిజల్ స్ట్రీమింగ్‌కు వచ్చి దూసుకు పోతుంది.
మార్చి నెలలో చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం టుక్ టుక్ (Tuk Tuk Movie). ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు, ఓ స్కూటర్ చుట్టు నడిచే కథతో వచ్చిన ఈ మూవీ ఆపై డిటిజల్ స్ట్రీమింగ్‌కు వచ్చి దూసుకు పోతుంది. మొదటగా ఈ టీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం రెండు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైతం వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా అమోజాన్ (Amazon prime video) ఓటీటీ (Ott) లో జాతీయ స్థాయిలో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో రెండు వారాలుగా టాప్ టెన్‌లో ఉండటంతో పాటు ఇప్పటి వరకు యాభై మిలియన్‌ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. ఓ చిన్న సినిమాకు ఓటీటీలో ఇలాంటి ఆదరణ లభించడం చాలా అరుదుగా జరిగే విషయం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ థియేటర్‌తో పాటు మా సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉందని, సినిమాలో ఫాంటసీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, స్కూటర్ మ్యాజిక్ పవర్స్ పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరిస్తున్నాయన్నారు. హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్ (Karthikeyaa Dev), స్టీవెన్ మధు, సాన్వీ మేఘన (Saanve Megghana), నిహాల్ కోధాటి ముఖ్య పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ (Supreeth C Krishna) దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ నిర్మించారు.
సినిమా కథ విషయానికి వస్తే.. యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు డబ్బు కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి పండుగ చేస్తారు. ఆ ఊర్లో అంతకుముందు జరిగిన గొడవలు వల్ల వారి వినాయకుడి నిమజ్జనానికి వాహనం దొరకదు. దాంతో ఈ ముగ్గురు కలిసి ఓ షెడ్ నుంచి పాడు పడ్డ ఓ చేతక్ స్కూటర్‌ను బయటకు తీసి మరమత్తులు చేయించి లైన్‌లోకి తీసుకొస్తారు. దానికి టుక్ టుక్ అని పేరు పెట్టి వినాయకుడిని దానిపైనే ఊరేగించి నిమజ్జనం పూర్తి చేస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ స్కూటర్ కొన్ని విన్యాసాలు చేస్తుంది. ఏ ప్రశ్న అడిగినా సమాధానంగా హ్యాండిల్ అటు.. ఇటు తిప్పడం, లైట్ వెలగడం చేసి సమాధానం ఇస్తుంది. దాంతో ఆ స్కూటర్‌లో ఏదో ఉందని అక్కడి వాళ్లు నమ్ముతారు. ఇంతకీ ఆ స్కూటర్‌లో ఉన్నది ఏంటి? శిల్ప (శాన్వీ మేఘన)కు ఆ స్కూటర్‌కి సంబంధం ఏంటి? ఆమెకి ఏమైంది అన్నది టుక్ టుక్ (Tuk Tuk Movie) కథ.