Good Wife: గుడ్ వైఫ్‌గా వ‌స్తోన్న.. ప్రియ‌మ‌ణి

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:46 AM

ది ఫ్యామిలీమెన్‌,భామా క‌లాపం వంటి మంచి స‌క్సెస్ వెబ్ సీరీస్‌లతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక ప్రియ‌మ‌ణి. ఆమె లీడ్ రోల్‌లో రూపొందిన మ‌రో వెబ్ సిరీస్ గుడ్ పైఫ్

priyamani

ది ఫ్యామిలీమెన్‌,భామా క‌లాపం వంటి మంచి స‌క్సెస్ వెబ్ సీరీస్‌లతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక ప్రియ‌మ‌ణి. ఆమె లీడ్ రోల్‌లో రూపొందిన మ‌రో వెబ్ సిరీస్ గుడ్ పైఫ్ (Good Wife )ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఇందుకు సంబంధించి మేక‌ర్స్ మంగ‌ళ‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదిక‌గా స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్న‌ట్లు తెలిపారు. ప్రియ‌మ‌ణితో పాటు రేవ‌తి (Revathy), సంప‌త్ రాజ్ (Sampath Raj), ఆరి అర్జున‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Gshf42QWEAArGMY.jpg

ద‌శాబ్దం క్రింద‌ట అమెరిక‌న్ టీవీల్లో వ‌చ్చిన గుడ్ పైఫ్ (Good Wife) అనే లీగ‌ల్ థ్రిల్ల‌ర్ అధారంగా త‌మిళంలో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించి అదే పేరుతో ఇక్క‌డ ఓటీటీలోకి తీసుకు రాబోతున్నారు. సెక్స్ కుంభ‌కోణంలో చిక్కుకున్న త‌న భ‌ర్త‌ను ర‌క్షించేందుకు ఓ మాజీ లాయ‌ర్ చేసిన పోరాటం నేప‌థ్యంలో అదిరిపోయే థ్రిల్లింగ్‌, ఎమోష‌న‌ల్ డ్రామాగా ఉండ‌నుంది. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో సైతం సంప‌త్ జైల్లో ఉండ‌గా ప్రియ‌మ‌ణి లాయ‌ర్ వేష‌ధార‌ణ‌లో ఉన్న స్టిల్ పాత్ర తీరు తెన్న‌ల‌ను తెలియ జేస్తుంది. మ‌రో వారంలో ఈ సిరీస్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఈ సిరీస్‌ను త‌మిళంతో పాటు తెలుగు మ‌రో 5 భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 06:46 AM