Gang Rape: ఆ గ్యాంగ్ రేపు 3 ఫస్ట్ లుక్
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:14 PM
ఆ గ్యాంగ్ రేపు (Aa gang rape) షార్ట్ ఫిలిం 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొంది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందింది.
'ఆ గ్యాంగ్ రేపు' (Aa gang rape) షార్ట్ ఫిలిం 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొంది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందింది. దీనికి స్వీకెల్ చిత్రం 'ఆ గ్యాంగ్ రేపు-2' షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. అది కూడా ప్రేక్షకాదరణ పొందటం ఇప్పుడు మరో సన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా 'ఆ గ్యాంగ్ రేపు-3' (Aa gange Rape 3) త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు
దర్శకుడు యోగి కుమార్ (Yogi kumar) ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్ ఫిల్మ్ లవ్ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి 'ఆ గ్యాంగ్ రేపు-3' ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుందని మేకర్స్ తెలియజేసారు. త్వరలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, విడుదల తేదీ ప్రకటించనున్నారు. ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది.