F1 Movie OTT: ప్రపంచాన్ని షేక్ చేసింది.. ఇప్పుడు ఓటీటీకి వస్తోంది! ఎప్పటి నుంచంటే?
ABN , Publish Date - Aug 20 , 2025 | 10:14 AM
జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన రికార్డులు నమోదు చేసి కల్ట్ క్లాసిక్ పేరు తెచ్చుకున్న చిత్రం ఎఫ్ 1.
జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన రికార్డులు నమోదు చేసి కల్ట్ క్లాసిక్ పేరు తెచ్చుకున్న చిత్రం ఎఫ్ 1 (F1 Movie). హాలీవుడ్ టాప్ యాక్టర్ బ్రాడ్ పిట్ లీగ్ రోల్‌లో నటించగా టామ్ క్రూజ్‌తో 'టాప్ గన్: మేవరిక్' (Top Gun: Maverick) రూపొందించిన జోసెఫ్ కోసిన్ స్కీ (Joesph Kosinski) ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు అవుతున్నా ఇంకా అనేక దేశాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. 200 మిలియన్ డాలర్లు అంటే రూ.1700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్పాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి దాదాపు 600 మిలియన్ డాలర్లు అక్షరాల రూ. 5వేల కోట్ల వరకు వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ ఇండియాలో రూ.125 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేయడమే కాక కేవలం హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లోనే 55 వేలకు పైగా టికెట్లు తెగడం విశేషం.
ఇప్పటికీ అనేక థియేటర్లలో విజయంవంతంగా నడుస్తున్న ఈ సినమా అటు ఇటుగా రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. కథ విషయానికి వస్తే.. అప్పటికే రిటైర్డ్ అయిన రేసర్ సన్నీ హేస్ (Brad Pitt) తన స్నేహితుడు రూబెన్ నిర్వహిస్తున్న F1 టీమ్ APXGP అన్ని పొటోల్లో తీవ్రంగా విఫలమై తీవ్ర అర్థిక నష్టాల్లో కూరుకు పోతుంది. ఆ సమయంలో అతని కోరిక మేరకు సాయం చేయడానికి రేసింగ్ ట్రాక్‌లోకి దిగడమే కాక జోషువ (Damson Idris) అనే యువ రేసర్‌కు మెంటార్‌గా కూడా ఉంటాడు. మధ్యలో సన్నీ ఆరోగ్యం చెడి పోయినా రేస్ అలానే కంటిన్యూ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ యువ రేసర్, సన్నీ అతని మిత్రుల మధ్య నడిచే డ్రామా, గ్రాండ్ ప్రిక్స్‌లో జరిగే రేసింగ్‌లతో సాగుతూ ఆద్యంతం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చో పెడుతుంది.
కేవలం పది లోపు పాత్రలు, కారు రేస్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతూ ప్రేక్షకులను లైవ్ చూస్తున్నామా అనే రీతిలో డైరెక్ట్ కార్ రేసు ట్రాకింగ్ లోకి తీసుకెళ్లి హీరోతో పాటే ప్రయాణించేలా అనుభూతిని ఇస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ డ్రామా ఆకట్టుకోవడంతో పాటు రేసింగ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి ఎండ్ వరకు ఎలాంటి బోర్ అనే ఫీల్ రాకుండా తర్వాత ఏంటి అనే థ్రిల్ ఇస్తుంది. అందులోని పాత్రలను మనకు మనమే ఓన్ చేసుకుంటాం. ఇలాంటి ఈ ఎఫ్ 1 (F1 Movie) చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ ప్లస్ టీవీ (Apple TV+) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్‌లో మిస్సయిన వారు తప్పక చూడాల్సిన మూవీ ఇది. ఇదిలాఉంటే ఈ చిత్రం విడుదలయ్యాక జురాసిక్ వరల్డ్, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ వంటి భారీ చిత్రాలు వచ్చినా వాటినన్నింటినీ తట్టుకుని స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్ మల్టీఫ్లెక్సులలో మంచి అక్యూపెన్సీతో రన్ అవుతుండడం విశేషం.