veede Mana Vaarasudu: వీడే మన వారసుడు’ ప్రీ రిలీజ్ 

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:47 PM

నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’.



నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’ (Veede Mana Vaarasudu) రమేష్ ఉప్పు  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్టీటాలెంట్ చూపిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చారు పాల్గొన్న అతిథులు. జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల చేయ‌బోతున్నట్టు చిత్ర దర్శకనిర్మాత రమేష్ ఉప్పు తెలిపారు.

MLA మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. "అంతా తానే అయి సినిమాను తీసిన ఉప్పు రమేష్ ను అభినందిస్తున్నాను. రమేష్ ఉప్పు 1994లో నాకోసం పాటలు చేసేవారు. ప్రతిభ ఉన్న కళాకారుడు. ఆయన కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు మెసేజ్ సినిమాలు వచ్చేవి.. ఆ తరహాలో ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను.'' అని అన్నారు.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ."స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన‌ ఈ కుటుంబ క‌థా చిత్రాన్ని థియేట‌ర్‌కు వెళ్లి చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.'' అని చెప్పారు. "గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. అక్కడి మనుషులు, వాతావరణం ఎంతో బాగుండేది.  సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది."  అని  హీరోయిన్లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ అన్నారు.  ఈ వేడుకలో MLA మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, పోలీస్ ఆఫీసర్ రామావత్ తేజ, దర్శకుడు సముద్ర, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, 30 ఇయర్స్ పృథ్వి, హీరో కృష్ణసాయి, దిల్ రమేష్ , జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ నవీన్ నటుడు నాగ మహేష్, నటుడు, దర్శకనిర్మాత సాయి వెంకట్, తదితరులు పాల్గొని సినిమా హిట్ కావాలని విష్  చేశారు.  

Updated Date - Jul 02 , 2025 | 09:48 PM