Smitha: 2026 మొత్తం మ్యూజిక్కే: పాప్ సింగర్ స్మిత
ABN , Publish Date - Dec 13 , 2025 | 07:31 PM
తెలుగు పాప్ సింగర్ స్మిత రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. కొంతకాలంగా డివోషనల్ సాంగ్స్ కు పరిమితమైన స్మిత ఇప్పుడు 'మసక మసక' పేరుతో ఓ ఆల్బమ్ తెస్తోంది. దీన్ని నాగార్జున ఆవిష్కరించారు.
క్వీన్ ఆఫ్ పాప్ సింగర్ స్మిత ఓజి 'మసక మసక...' సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్ ని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశారు. జార్జ్. సి. విలియమ్స్ విజువల్స్ అందించారు. నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఈ పాటకి అడెలె ఎడిటర్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు దేవాకట్టా పాల్గొన్నారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాప్ సింగర్ స్మిత మాట్లాడుతూ, 'నాన్న ఒక థాట్ ని మొదలుపెట్టారు. 'హాయ్ రబ్బా' ఆల్బమ్ అమ్మ ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చింది. దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత అంతా హిస్టరీ. అదే ఇంటి పేరుగా మారింది. ఇప్పుడు ఇంటిపేరు మార్చుకుని 'ఓజి' చేద్దామని అనుకున్నాం. 2026 లో నా లైఫ్ లో కేవలం మ్యూజిక్ మాత్రమే ఉండబోతుంది. ఈ సాంగ్ ని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద లాంచ్ చేశారు. నార్త్ లో ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పాపులర్ అయ్యింది. సౌత్ లో మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. మళ్ళీ అలా ఆగకూడదని ఒక చిన్న బెంగ వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి ఒక పాట వస్తుంది. మేమే పండగ తెస్తున్నాం. ఆ పాట ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఇకపై వరుసగా పాటలు రాబోతున్నాయి. మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాలో రెండు లొకేషన్స్, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి' అని అన్నారు.
డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ, 'నిజానికి స్మిత ఓజి కాదు మాడ్ మాన్ స్టర్. తను ఈ ఆలోచన చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. తన ఆలోచనలు చాలా క్రేజీగా ఉంటాయి. తను ఫస్ట్ తెలుగు పాప్ స్టార్ గా ట్రెండ్ సెట్టర్. అందరికీ ఇన్స్పిరేషన్. ఈ సాంగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను' అని అన్నారు. డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ, 'ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. నా సినిమా ప్రయాణంలో స్మిత చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె నిర్వహించిన డాన్స్ షోలో నేను విన్నర్ గా నిలిచాను. ఆవిడే నాకు డాన్సర్ కొరియోగ్రఫీ కార్డు ఇప్పించారు. ఆ తర్వాత నాగర్జున గారితో పరిచయం ఏర్పడి 'నా స్వామి రంగా' సినిమాను డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత స్మిత ఈ మ్యూజిక్ వీడియో గురించి చెప్పారు. దీని కోసం రెండు అద్భుతమైన పాటలు షూట్ చేసాం' అని తెలిపారు. స్మితతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని, తన ఇండిపెండెంట్ మ్యూజిక్ కు స్మిత ఇన్ స్పిరేషన్ అని సింగర్ నోయల్ తెలిపాడు.