Nazriya Nazim Fahadh: ఫహద్ రియాక్షన్ ఏమిటో...
ABN, Publish Date - Apr 17 , 2025 | 02:43 PM
నాలుగైదు నెలలుగా ఎవ్వరికీ అందుబాటులో లేని నజ్రియా ఎట్టకేలకు మౌనం వీడింది. వ్యక్తిగతమైన సమస్యల కారణంగా అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది. ఆమె వివరణతో మరిన్ని సందేశాలకు తెర తీసినట్టయ్యింది.
ప్రముఖ నటి నజ్రియా నజిమ్ (Nazriya Nazim) తెలుగు చిత్రసీమలోకి 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ దానికంటే ముందే అనువాద చిత్రం 'రాజా రాణీ' (Raja Rani) తో తెలుగువారిని పలకరించింది. పలు మలయాళ చిత్రాలలో నటించి చక్కని నటిగా గుర్తింపు పొందిన నజ్రియాను తమిళ దర్శక నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్ళి వేషాలు ఇచ్చారు. అలానే నాని (Nani) మూవీలోని ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. బట్... 'అంటే సుందరానికి' మూవీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఆ తర్వాత ఆమె మేర తెలుగు సినిమాలోనూ నటించలేదు. కానీ ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఇటీవల ఆమె నటించిన 'సూక్ష్మదర్శిని' (Sookshmadarsini) మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీలో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అయిన తర్వాత నజ్రియాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ చిత్రంగా ఆ సినిమా విడుదలైన తర్వాత నజ్రియా అందరికీ దూరమై పోయింది. కనీసం సన్నిహితులు చేసిన కాల్స్ కూడా అటెండ్ చేయలేదు. ఆమెకు ఆఫర్స్ ఇద్దామని ప్రయత్నించిన దర్శక నిర్మాతలు ఆమెను రీచ్ కావడంలో విఫలమయ్యారు. దీనికి కారణం ఏమిటనేది తాజాగా నజ్రియా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.
సహజంగా సినిమా రంగంలోని స్టార్ హీరోయిన్ల నుండి 'డిప్రషన్, పర్శనల్ ప్రాబ్లమ్, మనసు బాగోలేదు' ... వంటి మాటలు వచ్చినప్పుడు అందరికీ వారి వైవాహిక జీవితం మీదకే దృష్టి పోతుంది. నజ్రియా తాజా లేఖను చదివిన వారిలో అత్యధిక శాతం మంది ఆమెకు, ఫహద్ కు మధ్య పొరపొచ్చలు వచ్చాయని, వీరిద్దరూ విడిపోబోతున్నారని రకరకాలుగా వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. వీటిల్లో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది! నజ్రియా క్షమాపణల లేఖతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత, ఆమె మీద, ఆమె భర్త ఫహద్ మీద ఉంది. నజ్రియా లెటర్ హెడ్ లోని పేరు చివర ఫహద్ పేరు ఉండటం వల్ల ఆమెకు, అతనికి మధ్య ఎలాంటి గొడవలూ లేవని, ఆమె ఎదుర్కొంటున్న సమస్య కేవలం వ్యక్తిగతమైనదని కొందరు అంటున్నారు. ఏదేమైనా... ఇటీవల సినిమా జంటలు కొన్ని విడిపోయిన నేపథ్యంలో ఫహద్, నజ్రియా జోడీ కూడా ఆ జాబితాలో చేరుతుందేమోననే ఆందోళనకు వారి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా నజ్రియా పెట్టిన పోస్ట్ కు సమంత లైక్ కొట్టడంతో సమంత బాటలోనే నజ్రియా కూడా నడవబోతోందా? అని సందేహపడుతున్నారు. మరి ఈ విషయంలో ఎటువైపు నుండి ఎవరు వివరణ ఇస్తారో చూడాలి.
Also Read: Rajini Kanth: రజనీకాంత్ తో బాలకృష్ణ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి