Monalisa: వార్నీ.. మోనాలిసాను భలే వాడేస్తున్నారుగా

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:32 PM

తెలుగులో 'లైఫ్' మూవీలో నటిస్తున్న కుంభమేళా ఫేమ్ మోనాలిసా ఇప్పుడు ఓపెనింగ్స్ కూ సిద్థమైపోయింది. తాజాగా బేల్ ట్రీ హోటల్ లోని కిచెన్ సెక్షన్ ను ఆమె ప్రారంభించింది.

Bael Tree Hotels

కొత్త సినిమా హీరోయిన్లు నటన ద్వారా కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా, ప్రాడక్ట్స్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ పారితోషికం అందుకుంటూ ఉంటారు. అందుకే కాస్తంత గుర్తింపు వచ్చే వరకూ సినిమా నిర్మాతల నుండి పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయరు. ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత నిర్మాతలే పోటీలు పడి హీరోయిన్ల రెమ్యూనరేషన్ ను పెంచేస్తూ ఉంటారు. అదే సమయంలో బ్రాండ్ అంబాసిడర్స్ గానూ లక్షలు, కోట్లు గడించేస్తారు. ఇలాంటి కొత్త హీరోయిన్ల జాబితాలోకి కుంభమేళా ఫేమ్ మోనాలిసా (Monalisa) సైతం చేరిపోయింది.

కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ దర్శనమిచ్చిన మోనాలిసా కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా మొదలైందన్న మాటే గానే ఆ తర్వాత పరిస్థితి ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఇదే సమయంలో మోనాలిసాకు తెలుగులోనూ అవకాశం వచ్చింది. ఆమె ఇప్పుడు 'లైఫ్‌' (Life) అనే పేరుతో ఓ తెలుగు సినిమా చేస్తోంది. కొత్త హీరోయిన్లు కోరుకునే లైఫ్‌ ను ఇప్పుడు మోనాలిసా లీడ్ చేస్తోంది. ఆమెతో ఓపెనింగ్స్ కూడా చేయించడానికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ 'బేల్ ట్రీ హోటల్' (Bael Tree Hotels) తన సేవలను మరింత విస్తరిస్తూ, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని మోనాలిసా శనివారం ప్రారంభించింది.


WhatsApp Image 2025-12-20 at 2.18.40 PM.jpeg

బేల్ ట్రీ హోటల్ యాజమాన్యం, సిబ్బంది మోనాలిసాకు స్వాగతం పలకగా, రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి' అని చెప్పింది. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్ లో కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్బంగా బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి హోటల్స్ పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, పరమశివునిపై తనకున్న భక్తి గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. 'బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. 'త్రిదళం త్రిగుణాకారం' అంటూ మనం పూజించే ఆ బిల్వ దళాల చెట్టు పేరునే మా సంస్థకు పెట్టుకోవడం మాకు గర్వకారణం. శివుడు అన్నదాత కూడా. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆ విశ్వేశ్వరుడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం. మా హోటల్స్ కు వచ్చే ప్రతి కస్టమర్‌కు మేము అందించే భోజనం ఒక ప్రసాదం లాంటిది' అని అన్నారు. బేల్ ట్రీ హోటల్స్ మరో యజమాని బాపిరెడ్డి మాట్లాడుతూ, కస్టమర్ల ఆరోగ్యానికి, రుచికి పెద్దపీట వేస్తూ ఈ కొత్త కిచెన్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 20 , 2025 | 06:41 PM