Chiranjeevi: శంకర వర ప్రసాద్‌సెట్‌లో.. తిలక్ వర్మకు సత్కారం
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:11 PM
ఆసియా కప్ ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్రను పోషించాడు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ. తాజాగా తిలక్ వర్మ 'మన శంకర్ వర ప్రసాద్ గారు' సెట్స్ కు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ అతన్ని సత్కరించింది.
ఆసియా కప్ (Asia Cup) ను భారత్ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రను పోషించాడు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma). పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మేన్ వరుసగా పెవిలియన్ దారి పడుతున్న సమయంలో స్థిరంగా క్రీజ్ దగ్గర నిలిచి, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తన జట్టును విజయ పథంలోకి తిలక్ వర్మ తీసుకెళ్ళాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ క్రీడాభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం తన సినిమా 'మన శంకర్ వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సెట్ కు వచ్చిన తిలక్ వర్మ ను ఆత్మీయంగా శాలువాతో సత్కరించారు. తిలక్ వర్మ ఈ సినిమా షూటింగ్ కు వచ్చిన సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల తో పాటు హీరోయిన్ నయనతార, నటి కేథరిన్ థెస్రా, నటుడు సచిన్ ఖేడేకర్ తదితరులు ఉన్నారు.