D.S. Rao: సినీ నిర్మాత, నటుడు డీఎస్ రావుకు గౌరవ డాక్టరేట్

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:08 AM

ప్రముఖ నిర్మాత, నటుడు డి.ఎస్. రావుకు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. సినిమా, సామాజిక రంగాలలో ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

ప్రముఖ నిర్మాత, నటుడు డీ.ఎస్. రావు (D.S. Rao) కు గౌరవ డాక్టరేట్ లభించింది. ఇక మీదట ఆయన డా. డి.ఎస్. రావు! తెనాలి సమీపంలోని మూల్పూర్ గ్రామానికి చెందిన డి.ఎస్. రావు పూర్తి పేరు దమ్మాలపాటి శ్రీనివాసరావు. దశాబ్దాల క్రితమే చిత్రసీమలోకి అడుగుపెట్టి నిర్మాతగా పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. అలానే పలు సినిమాలలో ప్రతినాయకుడి పాత్రతో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలకు డీఎస్ రావు పెట్టింది పేరు! చిత్రసీమలోని వివిధ విభాగాలతో అనుబంధం, ప్రవేశం ఉన్న డి. ఎస్. రావును ఇటీవల డే స్ప్రింగ్ థియొలాజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఈ యూనివర్సిటీ సాంస్కృతిక, సామాజిక రంగాలలో డి.ఎస్.రావు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ను అందించింది. ఈ సందర్భంగా ఆయన మిత్రులు హర్షం వెలిబుచ్చారు.

Updated Date - Apr 20 , 2025 | 12:08 AM