Sukumar: సుకుమార్ చేతుల మీదుగా తైవాన్ బోబా టీ బ్రాండ్ ‘షేర్ టీ’
ABN , Publish Date - Oct 05 , 2025 | 07:14 PM
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తైవాన్ బోబా టీ బ్రాండ్ ‘షేర్ టీ’ (Share tea) ఇప్పుడు హైదరాబాద్ వాసుల ముందుకు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తైవాన్ బోబా టీ బ్రాండ్ ‘షేర్ టీ’ (Share tea) ఇప్పుడు హైదరాబాద్ వాసుల ముందుకు వచ్చింది. హైటెక్ సిటీలోని ఇనార్బిట్ మాల్‌లో నూతన బ్రాంచ్‌ను దర్శకుడు సుకుమార్ (sukumar) ప్రారంభించారు. ఇండియాలో ఇది తొలి బ్రాంచ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్టనర్స్ ప్రవీణ్, అరుణ్, వికాస్, తేజ పాల్గొన్నారు. ‘బోబా టీ చిన్న(Taiwan Boba Tea) పిల్లల నుంచి యువత నచ్చుతుంది. విదేశాల్లో షూటింగ్‌లకు వెళ్తున్నప్పుడు ఎన్నో దేశాల్లో పిల్లల షేర్ టీ కోసం క్యూలైన్‌లో నిలబడటం చూశాను. ఇప్పుడు అదే బ్రాండ్ మన హైదరాబాద్‌లో అందుబాటులోకి రావడం, తైవాన్ టెక్నీషియన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, అసలైన రుచులతో ఈ స్టోర్ ప్రారంభించడం నిర్వాహకుల కృషికి నిదర్శనం’ అని అన్నారు.
1992లో తైవాన్‌లో స్థ్థాపించబడిన షేర్ టీ, ప్రస్తుతం 13 దేశాల్లో 500కు పైగా స్టోర్లతో ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘యువత ఉత్సాహాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన, ఆధునిక వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. భారతీయ మార్కెట్లో వేగంగా పెరుగుతున్న బబుల్ టీ సంస్కృతిని జనాలకు అందించబే మా లక్ష్యం. నాణ్యతలో రాజీపడము’ అని నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రారంభ వేడుకలో ఇన్ల్ఫుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు, టీ ప్రియులు పాల్గొన్నారు.