Dharma Mahesh: జిస్మత్ జైల్ మండీ నూతన రెస్టారెంట్ ప్రారంభించిన ధర్మ మహేష్ 

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:51 PM

భోజన ప్రియులకు శుభవార్త. జిస్మత్ (Jismat) జైల్ మండీ రెస్టారెంట్ ఇప్పుడు అమీర్ పేట్ లో అందుబాటులోకి వచ్చింది.

భోజన ప్రియులకు శుభవార్త. జిస్మత్ (Jismat) జైల్ మండీ రెస్టారెంట్ ఇప్పుడు అమీర్ పేట్ లో అందుబాటులోకి వచ్చింది. జిస్మత్ (Jismat) అధినేత ధర్మ మహేష్, తన కుమారుడు  జగద్వాజ పుట్టిన రోజు సందర్భంగా కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. ఇది భోజన ప్రియులకు వైవిధ్యమైన రుచులను అందించనుందని తెలిపారు. మండీ అంటే జిస్మత్ (Jismat) అన్నట్లు ఎప్పుడు  భోజన ప్రియులకు మొదటిస్థానం లో ఉండేలా, కొత్తదనమైన రుచులతో చికెన్, మటన్, ఫిష్, పన్నీర్ వంటి పదార్థాలను  అందుబాటులో ఉంచుతున్నాం అని చెప్పారు. 

 'సిందూరం,  డ్రింకర్ సాయి' చిత్రాల ద్వారా నటుడు ధర్మ మహేష్ గుర్తింపు పొందారు. ఆయన మాట్లాడుతూ 'జిస్మత్ (Jismat) నా కుమారుడు  జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టింది. ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల  చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటుంది. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి' అని అన్నారు. 

Updated Date - Nov 23 , 2025 | 08:27 PM