Nidhhi Agerwal: నిన్న హనీ రోజ్.. ఈ రోజు నిధి అగర్వాల్.. ఎందుకిలా?
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:09 PM
Nidhhi Agerwal: హనీ రోజ్ తర్వాత మరో హీరోయిన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను బాగా వేధిస్తున్నాడంటూ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పోలీసులను సంప్రదించింది. ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఏం చెప్పిందంటే..
‘‘నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. నన్నే టార్గెట్ చేస్తున్నాడు. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు..’’ అంటూ రీసెంట్‌గా బ్యూటీ హీరోయిన్ హనీ రోజ్ సైబర్ క్రైమ్‌కి కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హనీ రోజ్ కంప్లయింట్‌తో ఆమెని వేధిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ సైబర్ క్రైమ్‌ని సంప్రదించడంతో.. సమాజం ఎందుకిలా తయారైంది? ముఖానికి రంగేసుకున్నంత మాత్రాన.. ఇలా ఎలా పడితే అలా వేధిస్తారా? అంటూ నెటిజన్లు కొందరు హీరోయిన్లకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు సైబర్ క్రైమ్‌ని సంప్రదించిన హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? నిధి అగర్వాల్.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎవరూ ఊహించి ఉండరు కదా..
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్‌లో ఆమె పేర్కొంది. ఈ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్‌ని సొంతం చేసుకున్న నిధి అగర్వాల్‌కు కెరీర్ పరంగా ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’, రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.