Superman: ప్రపంచమంతా.. ఎదురుచూస్తున్న సినిమా వచ్చేస్తోంది
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:10 AM
కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భారీ హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భారీ హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్: లెగసీ (Superman) మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా కనపడనుండగా రాచెల్ బ్రాస్నహన్, నికోలస్ హౌల్ట్, ఈడి గతేగి, ఆంథోనీ కారిగన్, నాథన్ ఫిలియన్, ఇసాబెలా మెర్సిడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. గతంలో హాలీవుడ్ భారీ చిత్రాలు సూసైడ్ స్క్వౌడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీల చిత్రాలను తెరకెక్కించిన జేమ్స్ గన్ (James Gunn) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ఒకదాన్ని మించి మరోటి రెట్టింపు స్పందనను తీసుకు రావడంతో మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
DC స్టూడియోస్ మొట్ట మొదటి సారిగా DC యూనివర్స్ (DCU)లో నిర్మించిన తొలి చిత్రం కాగా సూపర్‌మ్యాన్ ఫిల్మ్ సిరీస్‌లో రెండవ రీబూట్ చిత్రం. ఈ యూనివర్స్‌లో మొదటి సినిమాగా ఈ సూపర్ మ్యాన్ గాడ్స్ వర్సెస్ మాన్‌స్టర్స్ వస్తోంది. తన పెంపుడు కుటుంబంతో కలిసి తన వారసత్వన్ని పునరుద్దరించే క్రమంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లు ఒకదాన్ని మించి మరోటి ప్రేక్షకాధరణనను దక్కించుకోగా ట్రైలర్లు ఒకదానికి మరోటి భిన్నంగా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఇప్పుడు ఈ చిత్రం కోసం చాలా అతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇక.. ట్రైలర్ల మధ్యలో ఇచ్చిన డిటెయిల్స్ , విజువల్స్, విలన్ పాత్ర స్టన్నింగ్ గా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు వచ్చిన వాటికి మిన్నగా అంతకు మించి అనేలా యాక్షన్, అడ్వెంచరస్ సన్నివేశాలతో ఆసక్తికరమైన కథతో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా చిత్రాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు. తెలుగులో డబ్బింగ్ సైతం బాగా కుదిరింది. జూలై11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన స్థానిక భాషలన్నింటి లోనూ థియేటర్లలో విడుదల కానుంది. మీకు సమయం లభిస్తే మీ పిల్లలతో కలిసి మిస్సవ్వకుండా చూసేయండి. ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రివ్యూ జరుగగా మంచి రివ్యూస్ సైతం వస్తున్నాయి.