Zootopia 2: చైనాలో.. ‘జూటోపియా 2’ సునామీ! డే 1లోనే 900 కోట్ల దాకా వసూళ్లు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:32 PM
ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త కంటెంట్‌ను ఇండియన్ ప్రేక్షకులు భాష, జానర్, ఫార్మాట్ ఏదైనా సరే… మంచి కంటెంట్ అయితే చాలు వెంటనే ఓన్ చేసుకుని ఆస్వాదిస్తూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త కంటెంట్‌ను ఇండియన్ ప్రేక్షకులు ఎప్పుడైనా ఓన్ చేసుకుని మరి కరువు తీరా ఆస్వాదిస్తూ ఉంటారు. భాష, జానర్, ఫార్మాట్ ఏదైనా సరే… మంచి కంటెంట్ అయితే చాలు మన సినిమా ప్రేమికులు వెంటనే అంగీకరిస్తారు. కానీ చైనా మార్కెట్ విషయంలో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. ఇతర దేశాల సినిమాలను రిసీవ్ చేసుకునే విషయంలో అక్కడి ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపరు. అయితే, ఈ ట్రెండ్‌ను మారుస్తూ హాలీవుడ్‌లోని ఓ యానిమేషన్ చిత్రం అక్కడ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఆ చిత్రం ‘జూటోపియా 2’ (Zootopia 2).
రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన జుటోపియా 2 చిత్రం గ్లోబల్‌గా ఓపెనింగ్ వీకెండ్‌లోనే 556 మిలియన్ డాలర్ల భారీ కలెక్షన్ సాధించింది. ముఖ్యంగా చైనాలో చిత్రం ఒకే రోజులో 925 కోట్లు గ్రాస్‌ను రాబట్టడం విశేషం. సుమారు 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ యానిమేషన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా నిలిచింది. చైనాలో హాలీవుడ్ ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ ‘జూటోపియా 2’ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే గ్లోబల్‌గా 200 మిలియన్+ డాలర్లు వసూలు చేసి షాక్ ఇచ్చింది. అక్కడ హాలీవుడ్ చిత్రాలు ఇంత వేగంగా వసూళ్లు సాధించడం గగనం. ముఖ్యంగా యానిమేషన్ చిత్రాలైతే మరీ మరీ అరుదు.

సాధారణంగా ఒకప్పుడు యానిమేషన్ చిత్రాలకు లైవ్-యాక్షన్ సినిమాలతో పోలిస్తే టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువగా ఉంటుండే వారు. భారీ వసూళ్లు సాధించడం కూడా చాలా కష్టం. మరోవైపు చైనా, భారత్ మరికొన్ని దేశాలలో ఆడియన్స్ యానిమేటెడ్ సినిమాల్ని ఇంతగా ఆదరించడం కూడా ఇప్పటివరకు చూడనిదే. కానీ ‘జూటోపియా 2’ ఈ అన్ని అంచనాలను బద్దలుకొట్టింది. భారీ సినిమాలను కూడా దాటేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ యేడు వచ్చిన నెజా2, మహావతార్ నరసింహ, బ్యాడ్‌డాయ్స్, లిలో స్టిచ్ , డాగ్‌మాన్ వంటి యానిమేషన్ చిత్రాలు ఒక దాన్ని మించి మరోటి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాపీసుల వద్ద సునామీలను సృష్టించాయి. ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నుతూ రెండు రోజుల క్రితం విడుదలైన జోటొపియా 2 సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
జూడీ హాప్స్, నిక్ వైల్డ్ అనే డిటెక్టివ్ జంట జూటోపియా నగరాన్ని అతలాకుతలం చేస్తున్న ఓ రహస్య రిప్టైల్ నేరస్తుడిని పట్టుకునేందుకు బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో ఈ కేసు వారి జీవితాలను ఏ స్థాయిలో పరీక్షించింది, క్రిమినల్‌ను పట్టుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరి. ఇంత సింఫుల పాయింట్‌తో వచ్చిన ఈ ‘జూటోపియా 2’ ఇప్పుడు హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఈ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే చైనా మార్కెట్‌లో యానిమేటెడ్ చిత్రాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సినిమాల నిర్మాణం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు బావిస్తున్నారు.