The Fantastic Four: First Steps: పెంటాస్టిక్ ఫోర్.. తిరిగి వచ్చేశారు! తెలుగు ట్రైలర్
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:06 AM
ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించేందుకు మరో హాలీవుడ్ చిత్రం అందులోనూ సూపర్ హీరోస్ సినిమా పెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ విడుదలకు రెడీ అవుతోంది.
ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించేందుకు మరో హాలీవుడ్ చిత్రం అందులోనూ సూపర్ హీరోస్ సినిమా పెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps) విడుదలకు రెడీ అవుతోంది. చివరగా దశాబ్ధం క్రితం వచ్చిన పెంటాస్టిక్ ఫోర్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో లాస్ట్ ఆఫ్ హస్ ఫేమ్ పెడ్రో పాస్కల్ (Pedro Pascal), వెనెస్సా కిర్బీ, ఎబోన్ మోస్-బచ్రాచ్, జోసెఫ్ క్విన్, జాన్ మల్కోవిచ్, జూలియా గార్నర్, రాల్ఫ్ ఇనెసన్, పాల్ వాల్టర్ హౌసర్ కీలక పాత్రలు పోషించగా మాట్ షక్మాన్ దర్శకత్వం వహించాడు. అయితే.. ఈ చిత్రం మరో నెలలో జూలై25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ట్రైలర్ తెలుగులోనూ రిలీజ్ చేశారు.