The Conjuring: భ‌యంతో చావాల్సిందే.. కంజురింగ్ ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:08 AM

హాలీవుడ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారిని అల‌రించేందుకు ముఖ్యంగా హ‌ర్ర‌ర్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారి కోసం మ‌రో సినిమా రెడీ అయింది.

The Conjuring

హాలీవుడ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారిని అల‌రించేందుకు ముఖ్యంగా హ‌ర్ర‌ర్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారి కోసం మ‌రో సినిమా రెడీ అయింది. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఎనిమిది భాగాలుగా వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన కంజురింగ్ సిరీస్‌లో చివ‌రి చిత్రంగా ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites) అనే సినిమా సెప్టెంబర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ మంచి ఆర‌ణ‌ను ద‌క్కించుకుని సినిమాపై హైప్ తీసుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

The Conjuring

2021లో వ‌చ్చిన ది కంజురింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ (The Conjuring: The Devil Made Me Do It) చిత్రానికి సీక్వెల్‌గా కాగా టోట‌ల్‌ కంజురింగ్ మూవీస్‌లో తొమ్మిదో ఇన్‌స్టాల్మెంట్ కావ‌డం విశేషం. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌రు ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ మూవీని మైఖేల్ చావ్స్ (Michael Chaves) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెరా ఫార్మిగా (Vera Farmiga), పాట్రిక్ విల్సన్ (Patrick Wilson), మియా టాంలిన్సన్ (Mia Tomlinson), బెన్ హార్డీ (Ben Hardy) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ టీజ‌ర్‌ను చూస్తే పాత చిత్రాల‌ను మించి భ‌య‌పేట్టేలా ఉంది. చాలా సంవ‌త్స‌రాలుగా క‌నిపించ‌ని ద‌య్యం తిరిగి రావ‌డం ఎడ్ అండ్ లోరెన్ జంట‌ను వెండించ‌డం, ఆపై వారి ప్రాణం మీద‌కు వ‌చ్చే సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్ కూడా హై లెవ‌ల్‌లోనే బావున్నాయి.

Updated Date - Aug 01 , 2025 | 09:15 AM