The Conjuring: Last Rites: ఈసారి గట్టిగానే ఫ్లాన్ చేసినట్లు ఉన్నారుగా! ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ తెలుగు టీజర్
ABN , Publish Date - May 09 , 2025 | 04:10 PM
హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ అనే హాలీవుడ్ సినిమా సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.
హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites) అనే హాలీవుడ్ సినిమా సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా 2021లో వచ్చిన ది కంజురింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ (The Conjuring: The Devil Made Me Do It) చిత్రానికి సీక్వెల్‌గా కాగా టోటల్ కంజురింగ్ మూవీస్‌లో తొమ్మిదో ఇన్‌స్టాల్మెంట్ కావడం విశేషం.
వాస్తవ ఘటనలరు ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ మూవీని మైఖేల్ చావ్స్ (Michael Chaves) దర్శకత్వం వహించాడు. వెరా ఫార్మిగా (Vera Farmiga), పాట్రిక్ విల్సన్ (Patrick Wilson), మియా టాంలిన్సన్ (Mia Tomlinson), బెన్ హార్డీ (Ben Hardy) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ టీజర్‌ను చూస్తే పాత చిత్రాలను మించి భయపేట్టేలా ఉంది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.