Supergirl: సూపర్ మ్యాన్.. చెల్లి వస్తోంది! గెట్ రెడీ.. తెలుగు ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:39 AM
ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినీ అభిమానులను అలరించేందుకు ఓ కొత్త సూపర్ హీరో సిద్దమైంది.
ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినీ అభిమానులను అలరించేందుకు ఓ కొత్త సూపర్ హీరో సిద్దమైంది. ఇప్పటికే ఈ యేడు వచ్చిన థండర్ బోల్ట్స్, సూపర్ మ్యాన్ వంటి భారీ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించవగా తాజాగా అదే కోవలో సూపర్ మ్యాన్ సోదరి సూపర్ గర్ల్ (Supergirl) థియేటర్లకు వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సూపర్ మ్యాన్‌పై సెటైర్లు వేస్తూ, అంతా ఈజీగా, ఫన్నీగా తీసుకుని పని పూర్తి చేసే సూపర్ పవర్స్ ఉన్న గర్ల్‌గా మిల్లీ ఆల్కాక్ (Milly Alcock) అదరగొట్టింది. యాక్షన్ సీన్స్ కూడా గత చిత్రాల ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి. DC స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (Warner Bros Pictures) నుంచి వస్తున్న ఈ చిత్రానికి అనా నోగ్వేరా (Ana Nogueira)స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ అవనుంది.
ఇదిలాంటే నాలుగు నెలల క్రితం వచ్చి మంచి విజయం సాధించిన సూపర్ మ్యాన్ సినిమాలో ఓ సన్నివేశంలో అతని చెల్లి సూపర్ గర్ల్ పాత్రను పరిచయం చేయగా మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ క్యారెక్టర్‌తో పూర్తి స్తాయి సినిమానే వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.