Disclosure Day: స్టీవెన్ స్పీల్‌బర్గ్.. తిరిగొచ్చేశాడు! కొత్త మూవీ టీజర్ అదిరింది
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:07 AM
నాలుగేండ్ల విరామం తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) దర్శకత్వం వహించిన చిత్రం ‘డిస్క్లోజర్ డే’.
నాలుగేండ్ల విరామం తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) దర్శకత్వం వహించిన చిత్రం ‘డిస్క్లోజర్ డే’. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే సంవత్సరం జూన్ 12న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ అఫీషియల్ టీజర్ విడుదల చేశారు. ఎమిలీ బ్లంట్ (Emily Blunt) లీడ్ రోల్‌లో నటించగా జోష్ ఓ'కానర్, కోలిన్ ఫిర్త్, ఈవ్ హ్యూసన్, కోల్మన్ డొమింగో, ఎలిజబెత్ మార్వెల్, వ్యాట్ రస్సెల్ ప్రధాన పాత్రలు పోషించారు.
అయితే.. ఈ టీజర్‌ను చూస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని భారీగా పెంచుతోంది. టీజర్ ప్రారంభం నుంచే సస్పెన్స్ తో, ఓ మిస్టరీని అంతర్లీనంగా మెయింటన్ చేస్తూ బయటపెట్టకుండా ఆసక్తికరమైన విజువల్స్, డార్క్ టోన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటోంది. ప్రతి షాట్‌లోనూ ఏదో సీక్రెట్ ఉంటుందనేలా టీజర్ కట్ చేశారు.
విజువల్ నేరేషన్, కట్టిపడేసే మ్యూజిక్, షార్ప్ ఎడిటింగ్ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. కథాంశాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా, ప్రశ్నలు రేపుతూ ప్రేక్షకులను ఆలోచించేలా చేయడంలో టీజర్ సక్సెస్ అయ్యింది. చివరి ఫ్రేమ్‌లో వచ్చే హుక్ మాత్రం సినిమా మీద అంచనాలను రెట్టింపు చేస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే.. ‘డిస్క్లోజర్ డే’ టీజర్ మిస్టరీ, థ్రిల్లర్ అభిమానులను ఖచ్చితంగా ఆకట్టుకునేలా, అంతకుమించి ఏదో ఉంది సినిమాలో అనేలా ఆసక్తికరంగా ఉంది. టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, పూర్తి స్థాయి ట్రైలర్‌లో ఇంకెన్ని షాకింగ్ అంశాలు బయటపడతాయో చూడాల్సిందే.