SquidGame3: చివ‌రి ఆట మాములుగా ఉండ‌దు.. స్క్విడ్ గేమ్ ఫైన‌ల్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jun 15 , 2025 | 02:54 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ మ‌రో ప‌ది రోజుల్లో జూన్ 27 నుంచి డిజిట‌ల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేయ‌నుంది.

squid game

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) మ‌రో ప‌ది రోజుల్లో జూన్ 27 నుంచి డిజిట‌ల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ సీరిస్ రెండు భాగాలుగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించి ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే థ్రిల్ల‌ర్‌ను పంచాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సిరీస్ ఫైన‌ల్ సీజ‌న్3 ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌ల‌తో పాటు యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Squid Game

మొద‌టి సీజ‌న్‌లో.. స్క్విడ్ గేమ్ (Squid Game) గెలిచిన 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ తిరిగి ఆ గేమ్ మ‌ళ్లీ ప్రారంభిస్తున్న‌ట్లు తెలుసుకుంటాడు. అక్క‌డ జ‌రుగుతున్న దుర్మార్గాన్ని ప్ర‌పంచానికి తెలియజేయాల‌ని తిరిగి గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ కొంత‌మందితో టీమ్‌గా ఏర్ప‌డి గేమ్ నిర్వాహ‌కుల‌పై ఎదురు దాడికి దిగుతాడు. కానీ వాళ్ల‌లో చాలామంది చ‌నిపోగా 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ ప‌ట్టుబ‌డి మ‌ళ్లీ గేమ్ ఆడాల్సిన ప‌రిస్థితితో రెండో సీజ‌న్‌ ముగించారు.

Squid Game2

ప‌ట్టుబ‌డ్డ హీరో తిరిగి గేమ్‌లోకి వ‌చ్చిన హీరో ప్లేయ‌ర్స్‌ను రక్షించ గ‌లిగాడా లేదా, నిర్మాహ‌కుల‌ను ఎలా ఎదుర్కొన్నాడు, పోలీసులు ఆ గేమ్ జ‌రిగే ప్రాంతాన్ని క‌నుగొనగ‌లిగారా లేదా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మూడో సీజ‌న్ ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మొద‌టి రెండు భాగాల‌కు మించిన గేమ్స్, ట్విస్టుల‌తో ఈ ఫైన‌ల్ సీజ‌న్ సాగ‌నున్న‌ట్లు ఈ ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. జూన్ 27న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో కొరియ‌న్తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Jun 15 , 2025 | 02:54 PM