Jurassic World Rebirth: జురాసిక్ వరల్డ్ రీబర్త్.. కొత్త ట్రైలర్ వచ్చేసింది!
ABN, Publish Date - May 20 , 2025 | 06:46 PM
సినీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికర హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్ వచ్చేస్తోంది. తాజాగా మంగళవారం మే20న మరో ట్రైలర్ విడుదల చేసింది.
సినీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికర హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth) వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ సినిమాల ఫ్రాంచైజీలో ఏడవ చిత్రంగా, 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ సంఘటనల అనంతరం ఐదు సంవత్సరాలకు జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈక్రమంలో తాజాగా మంగళవారం మే20న మరో ట్రైలర్ విడుదల చేసింది.
గతంలో గాడ్జిల్లా(2014), రోఘ్, ది క్రియేటర్ వంటి భారీ చిత్రాలను డైరెక్ట్ చేసిన గారెత్ ఎడ్వర్డ్స్ (Gareth Edwards) దర్శకత్వం వహించాడు. అంతకుముందు చిత్రాలను మించిన ఉత్కంట భరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 2, 2025న థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. హాలీవుడ్ అగ్ర నటి స్కార్లెట్ జోహన్సన్, జోనాథన్ బెయిలీ, మహెర్షలా అలీ కీలక పాత్రలో నటిస్తున్నారు.