Highest 2 Lowest Teaser: ది గ్రేట్ అకిరా కురోసావా సినిమా రిమేక్.. హయ్యస్ట్ 2 లోయస్ట్ టీజర్ వచ్చేసింది.
ABN , Publish Date - May 06 , 2025 | 09:57 PM
సుప్రసిద్ద అమెరిన్ నటుడు డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington) కథానాయకుడిగా రూపొందించిన నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హయ్యస్ట్ 2 లోయస్ట్ (Highest 2 Lowest).
సుప్రసిద్ద అమెరిన్ నటుడు డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington) కథానాయకుడిగా రూపొందించిన నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హయ్యస్ట్ 2 లోయస్ట్ (Highest 2 Lowest). ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన డైరెక్టర్ అకిరా కురోసావా (Akira Kurosawa's) 1963లో రచించి దర్శకత్వం వహించిన హై అండ్ లో (High and Low) అనే జపనీస్ సినిమాను ఇప్పుడు ఇంగ్లీష్‌లో పునర్నిర్మించారు.
స్పైక్ లీ (Spike Lee) దర్శకత్వం వహించాడు. ఇల్ఫెనేష్ హడేరా, జెఫ్రీ రైట్, ఐస్ స్పైస్, ASAP రాకీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగష్టులో థియేటర్లలోకి రానుండగా సెప్టెంబర్ 5 నుంచి యాపిల్ (Apple TV+) ఓటీటీలో స్ట్రీమింగ్ కనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.