Nobody 2: జాన్ విక్‌ను మించి యాక్షన్.. నోబడి2 ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - May 15 , 2025 | 03:42 PM
బాబ్ ఓడెన్‌కిర్క్, కోనీ నీల్సన్ నాలుగేండ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నోబడీ
బాబ్ ఓడెన్‌కిర్క్ (Bob Odenkirk), కోనీ నీల్సన్ (Connie Nielsen) నాలుగేండ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నోబడీ (Nobody). ఇల్యా నైషుల్లర్ (Ilya Naishuller) దర్శకత్వంలో 2021లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించడమే కాక యాక్షన్ సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది.
హబ్స్ అండ్ షా, డెడ్ ఫూల్2, బుల్లెట్ ట్రైన్, ఆటోమిక్ బ్లాన్డే, ది ఫాల్‌గయ్ వంటి భారీ సినిమాల డైరెక్టర్ డేవిడ్ లించ్ (David Leitch) ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇప్పటికీ టాప్ టెన్‌లో ఉండడం ఈ మూవీ ప్రత్యేకత.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన నోబడీ2 (Nobody 2) విడుదలకు రెడీ అయింది. టిమో ట్జాజంటో (Timo Tjahjanto) దర్వకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫస్ట్ పార్ట్‌ను తలదన్నేలా రెండో భాగం ఉండనున్నట్లు అర్థమవుతోంది.
భార్య , పిల్లలతో హ్యాపీగా ఉండే హీరోకు అనుకోకుండా పిల్లలు చేసిన చిన్న తప్పిదం వళ్ల ఓ చిన్న ఘర్షణ కావడం అది కాస్త పెద్దగా మారి ఓ పెద్ద ధనవంతుని సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు ఎలా వెల్లింది, తన ఫ్యామిలీని ఎలా రక్షించకున్నాడనే పాయింట్‌తో సినిమా మొదటి నుంచి చివరి వరకు మొత్తం యాక్షన్ సన్నివేశాలతోనే నింపినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ మొదటి పార్ట్ జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.