Chief Of War: ఆక్వామెన్ హీరో కొత్త సినిమా.. చీఫ్ ఆఫ్ వార్ ట్రైలర్
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:42 PM
ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్‌ను అలరించేందుకు ఓ భారీ హాలీవుడ్ సినిమా చీఫ్ ఆఫ్ వార్ రెడీ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్‌ను అలరించేందుకు ఓ భారీ హాలీవుడ్ సినిమా చీఫ్ ఆఫ్ వార్ (Chief Of War) రెడీ అయింది. హాలీవుడ్ టాప్ యాక్టర్ అక్వామెన్ ఫేమ్ జాసన్ మోమోవా (Jason Momoa) హీరోగా నటించగా టెమ్యూరా మారిసన్, లూసియాన్ బుకానన్, Te Ao ఓ హినేపెహింగా, కైనా మకువా, మోసెస్ వస్తువులు, సియువా ఇకలేఓ, బ్రాండన్ ఫిన్, జేమ్స్ ఉడోమ్, మైనేయి కినిమాక, తే కోహే తుహాకా కీలక పాత్రల్లో నటించగా థామస్ పా సిబ్బెట్ తో కలిసి జాసన్ మోమోవా దర్శకత్వం వహించడం విశేషం. యాపిల్ ఓటీటీ సంస్థ నిర్మించింది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా వీఓకులను బాగా అలరిస్తోంది. 18వ శతాబ్దం చివరలో హవాయి ద్వీపంలోని ప్రజలను ఏకం చేసే క్రమంలో అక్కడి తెగల మధ్య జరిగిన పోరాటాలు, వారిన ఆక్రమించేందుకు ఇతర దేశాల వాల్లు చేసే ప్రయత్నాలు తదితర ఆసక్తికరమైన కథ కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అగష్టు1న ప్రపంచ వ్యాప్తంగా డైరెక్ట్ యాపిల్ టీవీ ప్లస్ (Apple TV+) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.. మీరూ ఓ సారి ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.