Michael: మైఖెల్ జాక్సన్.. బయోపిక్ టీజర్ వచ్చేసింది
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:14 PM
మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “MICHAEL” సినిమా టీజర్ విడుదలైంది. జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో, ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కానుంది.
విశ్వ విఖ్యాత పాప్ సింగర్, దివంగత మైఖెల్ జాక్సన్ (Michael Jackson) జీవిత చరిత్ర ఆధారంగా హాలీవుడ్‌లో మైఖెల్ (MICHAEL) చిత్రం తెరకెక్కింది. జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) లీడ్ రోల్‌లో కనిపించనుండగా నియా లాంగ్, తౌరా హరియర్, జులియానో వల్ది కీలక పాత్రల్లో నటించారు. ఆంటోయిన్ ఫుక్వా(Antoine Fuqua) దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఏప్రిల్ 24 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు రానుంది. ఈ నేపత్యంలో మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. మైఖెల్ జాక్సన్ పూర్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. పాటలు, డ్యాన్సులు అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.