Diane Keaton: ది గాడ్‌ఫాదర్‌ నటి, ఆస్కార్‌ విజేత.. డయాన్‌ కీటన్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:53 AM

ఆస్కార్‌ విజేత, హాలీవుడ్‌ దిగ్గజ నటి డయాన్‌ కీటన్‌ 79 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

Diane Keaton

ఆస్కార్‌ విజేత, హాలీవుడ్‌ దిగ్గజ నటి డయాన్‌ కీటన్‌(79) (Diane Keaton) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాలు తన నట జీవితాన్ని కొనసాగించిన ఆమె హాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

Diane Keaton

ఆమె నటించిన ‘అనీ హాల్‌’ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ‘ది గాడ్‌ఫాదర్‌’ సిరీస్‌ ఆమెకు గ్లోబల్‌ స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. డయాన్‌ ధరించిన ప్రత్యేకమైన సూట్లూ, టోపీలు ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయి.

Updated Date - Oct 13 , 2025 | 07:14 AM