Tom Cruise Ana de Armas: ముచ్చటగా.. టామ్ క్రూజ్ నాలుగో పెళ్లి! లేటు వయసులో.. 'ఘాటు' భామతో ప్రేమ
ABN , Publish Date - Oct 03 , 2025 | 07:40 AM
హాలీవుడ్ ఆగ్ర నటుడు, సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హాలీవుడ్ ఆగ్ర నటుడు, సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆయన చేసే స్టంట్లు చూసే వారికి గుండెలు జారేలా చేస్తుంటాయి. వయసు మీద పడినా నేటి కుర్రకారుకు ఏమాత్రం తీసి పోని విధంగా యాక్షన్ చిత్రాలలో సాహసోపేత స్టంట్స్ చేసి ఔరా అనిపిస్తూ నిత్యం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంటాడు. అలాంటి ఈ హీరో తాజాగా మరో మారు ప్రేమలో పడగా ఇప్పుడు వారి వివాహం ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
విషయానికి వస్తే.. వయసులో తన కన్నా సగం మాత్రమే ఉన్న హాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రస్తుతం యూత్ హార్ట్ త్రోబ్ అనా డి ఆర్మాస్ (37) (Ana de Armas )తో ప్రేమాయణం సాగిస్తున్న ఆయన వారి బంధాన్ని చివరి దశకు తీసుకు వచ్చి పెల్లికి సిత్తం అయినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం టామ్ క్రూజ్ ఈ పెల్లిని సైతం థ్రిల్లింగ్ అనిపించేలా చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సముద్రంలో అండర్ గ్రౌండ్‌లో గానీ, స్కై డైవింగ్ చేస్తూ గానీ లేకుంటే అంతరిక్షంలోనైనా వివాహం చేసుకుని తమ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని అనుకున్నట్లు హాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
ఇదిలాఉంటే.. టామ్ క్రూజ్‌కు ఇది నాలుగో వివాహం. ఆయన ఇంతకుముందు మిమి రోజర్స్ (Mimi Rogers), నికోల్ కిడ్‌మన్ (Nicole Kidman), కేటీ హోమ్స్ (Katie Holmes)లను వివాహం చేసుకుని ఆపై విడాకులు ఇచ్చాడు. ఇప్పటికే నలుగురు సంతానం కూడా ఉన్నారు. అయితే.. మూడు నాలుగు నెలల క్రితం టామ్ – అనా జంట వెర్మాంట్‌లో మొదటిసారిగా పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించడంతో వీరి రిలేన్‌పై వార్తలు వచ్చాయి. ఆపై వాటిని నిజం చేస్తూ డేటింగ్‌లో ఉ్ననట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి రిలేషన్‌ను పెళ్లి వరకు తీసుకు వచ్చారు.
కాగా అనాకు సైతం మార్క్ కొల్టేట్ (Marc Clotet) అనే స్పానిష్ యాక్టర్‌ను వివాహం చేసుకుని విడాకులు తీసుకోగా ఆపై హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్ (Ben Affleck)తో ప్రేమాయణం నడిపింది. అది ముగియగానే క్యూబా అధ్యకుడి కుమారుడితోనూ వ్యవహారం నడిపించి చివరకు తన వయసుకు రెట్టింపు ఉన్న టామ్ క్రూజ్‌తో అధికారికంగా రెండో పెళ్లికి సిద్దమడడం విశేషం. చూడాలి ఈ బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో. అయితే అనాకు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది, ఇంచు మించు క్రూజ్‌తో సమానంగా గుర్తింపు ఉంది. మరి కొద్ది రోజులు ఆగితే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.