Sydney Sweeney: మరో థ్రిల్లర్‌తో వస్తున్న.. యూత్ కలల రాణి సిడ్నీ స్వీనీ
ABN, Publish Date - May 16 , 2025 | 09:25 AM
వరల్డ్ యూత్ డ్రీమ్ గర్ల్ సిడ్నీ స్వీనీ కథానాయికగా రూపొందిన కొత్త క్రైమ్, థ్రిల్లర్ చిత్రం అమెరికానా.
వరల్డ్ యూత్ డ్రీమ్ గర్ల్ సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) కథానాయికగా రూపొందిన కొత్త చిత్రం అమెరికానా(Americana). క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో మూడేండ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. టోనీ టోస్ట్ (Tony Tost) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాల్ వాల్టర్ హౌసర్ (Paul Walter Hauser), హాల్సే (Halsey), ఎరిక్ డేన్ (Eric Dane), జాన్ మెక్‌క్లార్నన్ (Zahn McClarnon), సైమన్ రెక్స్ (Simon Rex) కీ రోల్స్ లో నటించారు.
ఎంతో ఖరీదైన గోష్ట్ షర్ట్‌ను కొంతమంది అగంతకులు దొంగిలిస్తారు. దాని కోసం చాలా మంది వెతుకుతూ అడ్డం వచ్చిన వారిని చంపేస్తుంటారు. అలాంటి గ్యాంగ్ మధ్యలో చిక్కుకున్న హీరోయిన్ ఎలా బయట పడిందనే కథతో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఆగష్టు 22న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సంవత్సరం ఇమక్యూలేట్, ఈడెన్, మేడ్మీ వెబ్ వంటి చిత్రాలతో అలరించిన స్వీనీకి ఈ యేడు ఇదే రిలీజ్ చిత్రం అవడం విశేషం.