Predator: Badlands: అవ‌తార్‌3కి ముందే.. థియేట‌ర్ల‌కు మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌! గెట్ రెడీ

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:50 PM

హాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్‌ను ఉత్కంఠకు గురి చేసిన ప్రెడేటర్ ఫ్రాంఛైజీ మళ్లీ తెరపైకి వస్తోంది.

Predator: Badlands

హాలీవుడ్‌ సినీ ల‌వ‌ర్స్‌ను ఉత్కంఠకు గురి చేసిన ప్రెడేటర్ ఫ్రాంఛైజీ మళ్లీ తెరపైకి వస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ జాన‌ర్‌లో వస్తున్ననూత‌న‌ చిత్రం ‘ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ (Predator: Badlands)’ నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి. ఈక్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ఆఫీసియ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

Predator: Badlands

తాజాగా విడుదలైన ఫైనల్ ట్రైలర్ చూసిన వారందరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలతో సాగిన ప్రెడేటర్‌ సిరీస్‌లో ఇది ఏడవ చిత్రం. అయితే ఈసారి కథ పూర్తిగా కొత్తగా ఉంది. గతంలో మానవులపై యుద్ధం చేసిన ప్రెడేటర్‌ ఈసారి ఓ కొత్త‌ గ్రహంపై పడిపోతాడు. అక్కడ భయంకరమైన జంతువులు, రోబోట్స్‌, అధునాతన టెక్నాలజీతో ఉన్న మానవులు వీరందరి మధ్య అతనికి ఎదురైన సవాళ్ల‌తో సినిమా సాగ‌నుంది.

Predator: Badlands

అక్కడ శరీరం సగం ఉండే యువతి ప్రెడేటర్‌కు సహాయం చేయ‌డం, ఆ ఇద్దరూ కలిసి ఆ గ్రహం నుంచి ఎలా బయటపడ్డారు? ఏ విధంగా ఆ భయానక జీవులను ఎదుర్కొన్నారు? అనేది ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ స్టోరి. విజువల్స్‌, సీజీ వర్క్‌, యాక్షన్‌ సీన్స్‌ అన్నీ అంత‌కుమించి, వావ్ అనేలా ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా వెరైటీ జంతువుల డిజైన్‌, యాక్షన్‌ సన్నివేశాలు చూస్తే నిజంగానే ‘నెవర్ బిఫోర్’ అనిపించేలా ఉన్నాయి. ఒక్కసారి ట్రైలర్‌ చూస్తే సినిమా కోసం ఆగలేనంత ఉత్సాహం క‌లిగేలా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Predator: Badlands

గతంలో ప్రే (Prey), 10 క్లోవర్‌ఫీల్డ్‌ లేన్‌ (10 Cloverfield Lane) వంటి హిట్‌ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ (Dan Trachtenberg) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. 20th Century Studios నిర్మాణంలో వస్తున్న‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఎల్లే ఫానింగ్‌ (Elle Fanning), డిమిట్రియస్ షుస్టర్-కోలోమాతంగి (Dimitrius Schuster-Koloamatangi) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా ఆల‌స్య‌మెందుకు ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ (Predator: Badlands) తెలుగు ట్రైల‌ర్ ఇప్పుడే చూసేయండి.

Updated Date - Oct 07 , 2025 | 01:00 PM