Superman: ‘సూపర్‌మ్యాన్'.. తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

ABN , Publish Date - May 15 , 2025 | 06:07 PM

ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సూప‌ర్‌మ్యాన్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌గా తాజాగా మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

super

ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సూప‌ర్‌మ్యాన్ (Superman) సిద్ద‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌గా తాజాగా మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డం విశేషం.

Gq3KJabXoAABLm_.jpg

సూసైడ్ స్క్వౌడ్‌, గార్డ‌య‌న్స్ ఆఫ్ ది గెల‌క్సీల చిత్రాల డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్ (James Gunn) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా జూలై11న ప్ర‌పంచ వ్యాప్తంగా అయా స్థానిక భాష‌ల‌లోనూ విడుద‌ల కానుంది. తాజాగా.. నువ్వు చేసే చేతలు, నీ చేతుల్లోనే ఉంటాయి, వాటి వల్లే నువ్వు ఎవరో ఈ లోకానికి తెలుస్తుంది అంటూ తెలుగులోనూ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. డ‌బ్బింగ్ కూడా బాగా కుదిరింది. సూపర్‌మ్యాన్: లెగసీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Updated Date - May 15 , 2025 | 06:07 PM