How to Train Your Dragon: రూ.1725 కోట్లు.. హాలీవుడ్ సినిమా కలెక్షన్ల ఊచకోత! ఇండియాలోనూ షేకింగ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:32 PM
జూన్ రెండో వారం 13న థియేటర్లలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోన్న హాలీవుడ్ చిత్రం హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్
జూన్ రెండో వారం 13న థియేటర్లలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోన్న హాలీవుడ్ చిత్రం హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon). గతంలో యానిమేషన్ చిత్రాలుగా వచ్చి బహుళ ప్రాచూర్యం పొందిన ఈ సినిమాలకు లైవ్ యాక్షన్‌గా రూపం ఇస్తూ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మాసన్ థేమ్స్, నికో పార్కర్, గాబ్రియేల్ హోవెల్, జూలియన్ డెన్నిసన్, బ్రోన్విన్ జేమ్స్, హ్యారీ ట్రెవాల్డ్విన్, పీటర్ సెరాఫినోవిచ్, నిక్ ఫ్రాస్ట్, గెరార్డ్ బట్లర్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో ములన్, లిలో స్టిచ్, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ సిరీస్‌లో అన్ని యానిమేషన్ చిత్రాలను డైరెక్ట్ చేసిన డీన్ డెబ్లోయిస్ (Dean DeBlois) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించారు.
అయితే.. ఇంగ్లీస్‌తో పాటు భారతీయ ప్రముఖ భాషల్లోనూ ఇక్కడ విడుదలైన సినిమా మొదటి రోజు నుంచి మంచి మౌత్‌టాక్‌తో దూసుకెలుతోంది. సుమారు 150 మిలియన్ డాలర్లకు (రూ.1290 కోట్లు) పైగా ఖర్చుతో నిర్మించిన ఈ హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon) చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి మించి 200 మిలియన్ డాలర్ల (రూ.1710 కోట్లు) వరకు రాబట్టి ప్రపంచ బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ ఆప్రతిహాతంగా దూసుకుపోతుంది. అంతేకాదు ఈ యేడు హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాల్లో టాప్ 10లో చోటు సంపాదించుకుంది. సినిమా రిలీజ్ అయి కేవలం నాలుగు రోజులే అవడం ఇంకా లాంగ్ రన్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రమే టాప్ 1లో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
హాలీవుడ్ చిత్రం ఇక్కడి బాలీవుడ్, టాలీవుడ్ స్టైయిట్ చిత్రాలను కాదని మరి హౌజ్‌పుల్ కాలెక్షన్లు రాబడుతూ విశ్లేషకులను షాక్‌కు గురి చేస్తోంది. ఇప్పటికే టామ్ క్రూజ్ మిషన్ ఇంఫాజిబుల్ విడుదలై నెల అవుతున్నా మంచి వసూళ్లు రాబడుతుండగా ఇప్పుడు హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ ఈ మన దేశంలో కేవలం నాలుగు రోజుల్లో రూ.12 కోట్లకు మించి వసూళ్లూ సాధించి రికార్డు సృష్టిస్తోంది. మరో వారంలో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశాలు సైతం ఉన్నాయి. రానున్న నెల రోజుల పాటు పెద్ద యానిమేషన్ చిత్రాలు విడుదల లేక పోవడం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది.