Superman: సూపర్‌మ్యాన్ కొత్త తెలుగు ట్రైలర్ చూశారా.. అదిరిపోయింది
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:24 PM
సూపర్‌మ్యాన్ మళ్లీ వచ్చేశాడు. సూపర్‌మ్యాన్ కొత్త తెలుగు ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.
మరో నాలుగు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించేందుకు సూపర్ మ్యాన్ (Superman) సిద్ధమవుతున్నాడు. సూపర్‌మ్యాన్: లెగసీగా రూపొందిన ఈ సినిమా నుంచి డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా కనపడనుండగా గతంలో హాలీవుడ్ భారీ చిత్రాలు సూసైడ్ స్క్వౌడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీల చిత్రాల డైరెక్టర్ జేమ్స్ గన్ (James Gunn) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ఒకదాన్ని మించి మరోటి రెట్టింపు స్పందనను తీసుకు రావడంతో మూవీపై అంచనాలు ఆకాశంన్నంటుతున్నాయి.
అయితే ప్రస్తుతం సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్రైలర్‌ను తెలుగులో సైతం విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన దానికి భిన్నంగా మరింత స్ట్రాంగ్‌గా ఈ ట్రైలర్ ఉండగా మధ్యలో ఇచ్చిన డిటెయిల్స్ , విజువల్స్, విలన్ పాత్ర స్టన్నింగ్ గా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు వినని డొంతులతో డబ్బింగ్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. జూలై11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన స్థానిక భాషలన్నింటి లోనూ విడుదల కానుంది.