Rob Reiner: హాలీవుడ్.. స్టార్స్ దారుణ హత్య
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:38 PM
ప్రముఖ హాలీవుడ్ (Hollywood) డైరెక్టర్, నటుడు రాబ్‌రీనర్ (Rob Reiner-78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ప్రముఖ హాలీవుడ్ (Hollywood) డైరెక్టర్, నటుడు రాబ్‌రీనర్ (Rob Reiner-78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌లోని నివాసంలో ఇద్దరూ విగతజీవులుగా కనిపించారని హాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. ఇద్దరి శరీరాలపై కత్తి పోట్లు ఉన్నాయని చెబుతున్నారు. దీనిని హత్య కేసుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. (Rob Reiner passes away)
ఐదు దశాబ్దాల కెరీర్‌లో ‘దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్’, స్టాండ్ బై మి, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఆల్ ఇన్ ద ఫ్యామిలీ’ అనే ఫన్నీ టీవీ షోలో మైఖెల్ స్టివిక్ పాత్రతో ఆయన మంచి గుర్తింపు పొందారు. దర్శకుడిగా మారకముందే హాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. 1980ల్లో దర్శకుడిగా మారారు.. ‘దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్’తో సినిమా రంగంలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మిజరీ, కోర్ట్ రూమ్ డ్రామా ఏ ఫ్యూ గుడ్ మెన్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలుఅంతే కాదు పలు చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. తన నటనతో రెండుసార్లు ఎమ్మీ అవార్డులు అందుకున్న రాబ్ రీనర్.. ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.