Godzilla x Kong: Supernova: హాలీవుడ్.. మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్
ABN , Publish Date - May 11 , 2025 | 08:18 PM
హాలీవుడ్ సినిమా లవర్స్‌కు నిజంగా ఇది అదిరిపోయే వార్తే. తాజాగా హాలీవుడ్ నుంచి ఓ భారీ, ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించి ఆసక్తికర ఆప్డేట్ వచ్చింది.
హాలీవుడ్ సినిమా లవర్స్‌కు నిజంగా ఇది అదిరిపోయే వార్తే. తాజాగా హాలీవుడ్ నుంచి ఓ భారీ, ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించి ఆసక్తికర ఆప్డేట్ వచ్చింది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ (Godzilla x Kong) సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ప్రపంచ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం కాంగ్ న్యూ ఏంఫైర్ అంటూ వచ్చిన సినిమా కూడా రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టింది.
ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో మరో చిత్రం రెడీ అవుతుందని మేకర్స్ ప్రటించారు. ఈ మేరకు వార్నర్ బ్రదర్స్ కంపెనీ ఓ ఎనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేసి సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని సైతం ప్రకటించారు. ఈ సినిమాకు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా (Godzilla x Kong: Supernova)పేరు పెట్టినట్లు తెలిపి 2027 మార్చి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.