Game of Change: దేశ ప్రజలు గర్వపడేలా...
ABN , Publish Date - May 07 , 2025 | 05:16 PM
నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో నిజ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది 'గేమ్ ఆఫ్ ఛేంజ్' చిత్రం. మే 14న ఇది వివిధ భాషల్లో జనం ముందుకు రాబోతోంది.
ఐదవ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం (Nalanda University) నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'గేమ్ ఆఫ్ ఛేంజ్' (Game of Change). భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్రలో రాని నిజజీవితాల కథనాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. జాతీయ, అంతర్జాతీయ నటీనటులు ఈ మూవీలో నటించారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా దీనిని నిర్మించారు.
ఈ చిత్ర దర్శకుడు సిధిన్ (Sidhin) మూవీ గురించి చెబుతూ, ''ఈ సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం లాంటిది. సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను తీసుకొస్తాయి. అలాంటి వ్యక్తుల ఆకర్షణీయమైన నిజజీవిత కథనాలతో ఇది రూపుదిద్దుకుంది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ. 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది'' అని అన్నారు.
నిర్మాత సిద్ధార్థ్ రాజశేఖర్ (Siddharth Rajasekhar) మాట్లాడుతూ ''2018లో ‘ఇంటర్నెట్ లైఫ్ స్టైల్ హబ్’ ప్రారంభించి, ఇప్పటివరకు 30 వేల మందికి డిజిటల్ కోచింగ్ ఇచ్చాను. నేను ఇంగ్లీష్‌లో రాసిన ‘యు కెన్ కోచ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం సినిమా రంగంపై వున్న మక్కువతో నిర్మాతగా, నటుడిగా ‘గేమ్ అఫ్ చేంజ్’ చిత్రంతో మీ ముందుకు వచ్చాను'' అని అన్నారు. మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశాం. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఛావా’ (Chhaava) సినిమా మరాఠీ వారికీ, ఇతర భారతీయులకు కూడా తెలియని విషయాలను తెలియచేసింది. అలాంటి కథను వారు ప్రజల ముందుకు తీసుకువచ్చారు. సినిమా చూసిన ప్రతీ భారతీయుడికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వయో బేధం లేకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు దేశభక్తి ఉప్పొంగింది. అదే విధంగా మా 'గేమ్ ఆఫ్ చేంజ్' చిత్ర కథ ఉంటుంది. ఇలాంటి కథతో ఏ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకూ రాలేదు'' అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి