Foreign movies: మే మాసంలో ఆరు సినిమాలు

ABN , Publish Date - May 17 , 2025 | 11:21 AM

గడిచిన నాలుగు నెల్లలో మూడు ఆంగ్ల చిత్రాలు తెలుగులో డబ్ అయితే ఈ మే నెలలో వారానికి ఒకటి చొప్పున జనం ముందుకు వస్తున్నాయి.

హాలీవుడ్ (Hollywood) ఫిల్మ్ మేకర్స్ సమ్మర్ సీజన్ కు చాలా ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే సినిమాలను ఈ సీజన్ లో విడుదల చేస్తుంటారు. అలానే యువతను ఆకట్టుకునే యాక్షన్ చిత్రాలను విడుదల చేయడానికీ ఇదే సరైన సమయంగా వారు భావిస్తుంటారు. దాంతో హాలీవుడ్ లో రూపుదిద్దుకున్న ఎంటర్ టైన్ మెంట్ అండ్ యాక్షన్ మూవీస్ ఈ నెలలో జనం ముందుకు వస్తున్నాయి.

కేవలం హాలీవుడ్ మూవీస్ మాత్రమే కాదు... వివిధ దేశాల్లో రూపుదిద్దుకునే చిత్రాలు సైతం భారతదేశంలోని పలు భాషల్లో తమ చిత్రాలను డబ్ చేసి ప్రేక్షకుల పర్సులు ఖాళీ చేయాలని చూస్తున్నాయి. చిత్రం ఏమంటే గడిచిన నాలుగు నెలల్లో కేవలం మూడే ఆంగ్ల చిత్రాలు తెలుగువారి ముందుకు వచ్చాయి. జనవరిలో 'హాంగ్ కాంగ్ వారియర్స్, ఏజెంట్ గయ్ 007' విడుదల కాగా, ఫిబ్రవరి మాసంలో 'కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్' (Captain America: Brave New World) మూవీ వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏ ఆంగ్ల చిత్రం తెలుగులో డబ్ కాలేదు. కానీ మే నెలలకు వచ్చే సరికీ ప్రతి వీకెండ్ లోనూ ఓ ఆంగ్ల లేదా హాలీవుడ్ చిత్రం విడుదల అవుతూనే ఉంది. మే ఫస్ట్ వీకెండ్ లో 'థండర్ బోల్ట్స్' మూవీ తెలుగులోనూ విడుదలైంది. అయితే సరిగ్గా రెండు రోజుల్లో రిలీజ్ అనగా ఈ సినిమా పేరును మార్వెల్ సంస్థ 'ది న్యూ ఎవెంజర్స్' (New Avengers) అని మార్చేసింది.


మే సెకండ్ వీకెండ్ లో జపనీస్ మూవీ 'అవర్ డైనోజర్ డైరీ' తెలుగులో వచ్చింది. థర్డ్ వీకెండ్ లో 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' Final Destination: Bloodlines) విడుదలైంది. అలానే మే 17 (శనివారం) హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - ఫైనల్ రెకనింగ్' చిత్రం జనం ముందుకు వచ్చింది.

tc.jpgఇక రాబోయే వారంలో డిస్నీ సంస్థ నిర్మించిన 'లిలో అండ్ స్టిచ్' (Lilo and Stitch) లైవ్ యానిమేషన్ మూవీ తెలుగులో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రానుంది. అలానే ఈ నెల చివరి వారంలో అంటే 30వ తేదీన 'కరాటే కిడ్: లెజెండ్స్' (Karate Kid: Legends) మూవీ తెలుగులో వస్తోంది. ఆ రకంగా వారానికి ఓ ఆంగ్ల చిత్రం చొప్పున ఈ నెల ఏకంగా ఆరు విదేశీ చిత్రాలు తెలుగు వారిని అలరించే ప్రయత్నం చేస్తున్నాయి.

Also Read: Movies In Tv: మే 17, శనివారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 17 , 2025 | 12:00 PM