Emmy Awards: సత్తా చాటిన ‘అడాల్‌సెన్స్’ టీవీ సిరీస్
ABN , Publish Date - Sep 15 , 2025 | 02:51 PM
సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఎప్పటిలాగే లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ ఈ సినీ పండగకు వేదికైంది
సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఎప్పటిలాగే లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ ఈ సినీ పండగకు వేదికైంది (Emmy Awards 2025). హాలీవుడ్‌కు చెందిన సినీ సెలెబ్రెటీలు వేదికపై సందడి చేశారు. ఈ అవార్డు కోసం ఎన్నో సినిమాలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ‘అడాల్‌సెన్స్’ (Adolescence) సత్తా చాటింది. అయిదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ఓవెన్ కూపర్ అతి చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. '
ఎమ్మీ అవార్డు విజేతలు..
ఉత్తమ డ్రామా సిరీస్ : ది పిట్ (The Pitt)
ఉత్తమ నటుడు : నోహ్ వైల్ (ది పిట్)
ఉత్తమ నటి: బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
ఉత్తమ కామెడీ సిరీస్: ది స్టూడియో
ఉత్తమ సిరీస్: అడాల్‌సెన్స్
ఉత్తమ నటుడు (సిరీస్): స్టీఫెన్ గ్రాహం (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయ నటి (సిరీస్) : ఎరిన్ డోహెర్టీ (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయ నటుడు (సిరీస్) : ఓవెన్ కూపర్ (అడాల్‌సెన్స్)
ఉత్తమ స్క్రిప్ట్ రైటర్: లాస్ట్ వీక్ టునైట్..(సాటర్డే నైట్ లైవ్)
ఉత్తమ దర్శకుడు: ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్)
ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ సిరీస్) : ఫిలిప్ బారంటిని(అడాల్ సెన్స్)
ఉత్తమ సహాయ నటుడు: జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్)
ఉత్తమ సహాయనటి (కామెడీ): హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్)
ఉత్తమ రియాలిటీ షో: ది ట్రెయిటర్స్