Charlie Sheen: 47 వేలమంది అమ్మాయిలతో శృంగారం చేశా.. 15 ఏళ్ల నుంచే..

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:16 PM

హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ (Charlie Sheen) గురించి హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Charlie Sheen

Charlie Sheen: హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ (Charlie Sheen) గురించి హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాల్తాన్, వాల్ స్ట్రీట్, ది అరైవ‌ల్, హాట్ షాట్స్, స్కారీ మూవీ 3, ది త్రీ మ‌స్క‌టీర్స్, ది ఛేజ్ లాంటి సినిమాలతో చార్లీ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా అయన బాగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలతో ఆయన రిలేషన్ షిప్స్ చాలా ఎక్కువ అని హాలీవుడ్ లో టాక్.

తాజాగా చార్లీ ఇంపల్సివ్ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. ఇందులో ఆయన కెరీర్ లో జరిగిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఎన్నో క్రూరమైన పనులు చేసినట్లు తెలిపాడు. అప్పట్లో తనను ఆప్ శక్తి ఎవరు లేరని, ఏది అనిపిస్తే అది చేయడం తప్ప ఆలోచించలేదని ఒప్పుకున్నాడు. అమ్మాయిలు, డ్రగ్స్, మందు ఇలా ఏది చేయాలనీపిస్తే అది చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇక చార్లీ తన జీవితంలో ఇప్పటివరకు 45 వేలమంది అమ్మాయిలతో శృంగారం చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. అవును.. చార్లీ దాదాపు 45 వేలమంది అమ్మాయిలతో శృంగారం చేసినట్లు ఒప్పుకున్నాడు. తనకు 15 ఏళ్ళ వయస్సు నుంచి శృంగారంలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా తాను మొదటిసారి శృంగారం చేసిన అమ్మాయి పేరు కాండీ అని కూడా తెలిపాడు.

సింహం తినేస్తుందని భయంతో సఫారీ ఆపకూడదని, తానెప్పుడూ అలాంటి భయాలను పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడు చార్లీ. ఇక తన శరీరంలో ప్రవహిస్తుంది మనిషి రక్తం కాదని, టైగర్ బ్లడ్ ప్రవహిస్తుందని చెప్పిన ఈ 60 ఏళ్ల నటుడు కేవలం పార్టీ యానిమల్ గా కాకుండా బాధ్యత గల తండ్రిగా కూడా వ్యవహరించినట్లు చెప్పాడు. ఇక తన ప్రయాణాన్ని మొత్తం ది బుక్ ఆఫ్ షీన్ అనే పేరుతో డాక్యుమెంటరీ చేశానని, అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం షీన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Naga Durga: నాగ‌దుర్గ హీరోయిన్‌గా.. ‘కలివి వనం’! కొత్త పాట.. వ‌చ్చేసింది

Gopichand: యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ‌లో గోపీచంద్ సినిమా

Updated Date - Oct 26 , 2025 | 09:17 PM