Charlie Chaplin: శత వసంతాల 'గోల్డ్ రష్'

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:38 PM

చాప్లిన్ తన మూకీ చిత్రాలతో మెస్మరైజ్ చేశారు. అలా అలరించిన చాప్లీ మూవీస్ లో ఓ మేటి చిత్రం 'ద గోల్డ్ రష్'

charlie chaplin

ప్రపంచంలో సినిమాలు అధికంగా నిర్మించే దేశాల్లోని నటులు చార్లీ చాప్లిన్ (Charlie Chaplin) ప్రభావం నుండి తప్పించుకోలేరు - అనే సినీ సామెత ఈ నాటికీ ఉంది. కొందరయితే చార్లీ చాప్లిన్‌ను అనుకరించడమే నటన అని సాగిన వారూ ఉన్నారు. లండన్ లో జన్మించిన చార్లీ చాప్లిన్ నటునిగా అలరించిన తీరును ఏ దేశవాసులూ మరచిపోలేరు. అమెరికాలోనూ చాప్లిన్ జైత్రయాత్ర సాగింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చార్లీ చాప్లిన్ ను అమెరికన్లు బ్రిటన్ నటునిగానే గుర్తించేవారు. ఎందుకంటే సైలెంట్ ఎరాలో బ్రిటన్ లో చాప్లిన్, అమెరికాలో బస్టర్ కీటన్ తమదైన బాణీ పలికిస్తూ అలరించారు.

ఇద్దరూ కామెడీతోనే కన్నీళ్ళు పెట్టించిన ఘనులు. చాప్లిన్ కంటే కీటన్ ఎక్కువ సాహసాలు చేశారని అమెరికన్ సినీ ఫ్యాన్స్ ఈ నాటికీ చెబుతూ ఉంటారు. అయితే అమెరికా వెళ్ళిన తరువాత చాప్లిన్ అక్కడి వారి మనసులూ గెలుచుకున్నారు. చాప్లిన్ పేదవారి పక్షం నిలచి సినిమాలు రూపొందించారని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే స్వయంగా 'ద ట్రాంప్' పాత్రను క్రియేట్ చేసుకున్నారు. పొట్టి కోటు, వదులుగా ఉండే ప్యాంట్స్, నెత్తిన టోపీ ఇదీ ట్రాంప్ ఆహార్యం. ఈ గెటప్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఫ్యాన్స్ ను కట్టిపడేశారు చార్లీ చాప్లిన్.

చాప్లిన్ తన మూకీ చిత్రాలతో మెస్మరైజ్ చేశారు. అలా అలరించిన చాప్లీ మూవీస్ లో ఓ మేటి చిత్రం 'ద గోల్డ్ రష్' (The Gold Rush). 1925 జూన్ 26వ తేదీన ఈ సినిమా విడుదలయింది. చాప్లిన్ అమెరికాలో నిర్మించి, దర్శకత్వం వహించి నటించిన మూవీ 'ద గోల్డ్ రష్'. ఈ సినిమా కథ విషయానికి వస్తే - కెనడాలోని నార్త్ వెస్టరన్ జోన్ లోఉన్న క్లొండికే ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉంటాయి. వాటిని వెదికే క్రమంలో దాదాపు లక్షమంది ప్రయత్నం సాగించారు. దొరికిన వారి దగ్గర ఆ బంగారాన్ని కొనేవాళ్ళూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సారి మంచు తుఫాను పడుతుంది. ఆ సమయంలో లార్సెన్ అనే క్రిమినల్, జిమ్ అనేవాడు, బంగారు వెదుకులాటకు వెళ్ళిన హీరో ముగ్గురూ ఒకే క్యాబిన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. వారి మధ్య పోరాటం సాగుతుంది. చివరకు ముగ్గురూ ఓ ఒప్పందానికి వచ్చి క్యాబిన్ షేర్ చేసుకుంటారు.

Charlie Chaplin

తరువాత వారికి జార్జియా అనే అమ్మాయి పరిచయం కావడం, విడిపోవడం, చివరకు ఆమెను హీరో ఎలా కలుసుకున్నాడు అన్నదే 'ద గోల్డ్ రష్' కథ. ఈ కథలో అడుగడుగునా హీరో పాట్లు హాస్యం పుట్టిస్తాయి. అదే సమయంలో ఆలోచనలో పడేస్తాయి. మరికొన్ని సార్లు ఆ పాత్రపై జాలి కలిగేలా చేస్తాయి. ఈ తరహా కథలను తెరకెక్కించడంలోనూ, సదరు కథల్లో ప్రధాన పాత్రను జాలిగొలిపేలా చిత్రీకరించడంలోనూ, ఆ పాత్రను అభినయించడంలోనూ చార్లీ చాప్లిన్ తనకు తానే సాటి అనిపించుకున్నారు. అదే తీరున ద గోల్డ్ రష్ (The Gold Rush) లోనూ చాప్లిన్ తనదైన ముద్ర వేసి ఆకట్టుకున్నారు.

Charlie Chaplin

'ద గోల్డ్ రష్' టైటిల్ కు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే చార్లీ చాప్లిన్ వాటకు 2 మిలియన్ డాలర్లు వచ్చాయి. తరువాతి రోజుల్లోనూ ఈ సైలెంట్ మూవీ పలుమార్లు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా స్ఫూర్తితో కొందరు టాకీలు కూడా నిర్మించారు. ఏది ఏమైనా చాప్లిన్ 'ద గోల్డ్ రష్' తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ యేడాది జూన్ 26తో 'ద గోల్డ్ రష్' వందేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చాప్లిన్ వీరాభిమానులు ఈ సినిమాను గుర్తు చేసుకోవడమే కాదు, అందుబాటులో ఉన్న ప్లాట్ ఫామ్స్ లో తిలకించి ఆనందించారు.

Charlie Chaplin

Updated Date - Jun 26 , 2025 | 08:39 PM