Cannes Film Festival: ముగిసిన కేన్స్ చిత్రోత్సవం.. విజేత ఎవరంటే...
ABN , Publish Date - May 26 , 2025 | 06:13 AM
గత రెండు వారాలుగా ఫ్రాన్స్ వేదికగా జరిగిన 78వ కేన్స్ చిత్రోత్సవం శనివారం రాత్రితో ముగిసింది.
గత రెండు వారాలుగా ఫ్రాన్స్ వేదికగా జరిగిన 78వ కేన్స్ చిత్రోత్సవం (Cannes Film Festival) శనివారం రాత్రితో ముగిసింది. ఈ నెల 13న ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక కనుల పండువగా సాగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఉత్సవాన్ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చారు. మన దేశం నుంచి ఐశ్వర్య రాయ్, అలియా భట్, జాన్వీ కపూర్, ఊర్వశి రౌతేలా వంటి నటీమణులతో పాటు పేరొందిన ఇతర దేశాల సుందరాంగులు సైతం కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచి ఆహుతులను అలరించారు.
ఈ సందర్భంగా.. కేన్స్‌లో అత్యుత్తమ సినీ పురస్కారం ‘గోల్డెన్ పాల్మ్’ని అందుకోవడానికి విశ్వవ్యాప్తంగా అనేక సినిమాలు పోటీపడగా.. ఇరానియన్ దర్శకుడు జాఫర్ పనాహీ తెరకెక్కించిన ‘ఇట్ వజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్’ అనే చిత్రం ఈ ఏడాది ఆ ఆవార్డును దక్కించుకుంది. ఓ రోడ్ ట్రిప్ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర మలుపులతో ఈ చిత్రం సాగుతుంది. ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో’ చిత్రం అవార్డు దక్కించుకుంది. 1980ల కాలంలో ఎయిడ్స్ వ్యాధిపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై పోరాడే 12 ఏళ్ల బాలిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వీక్షకులను కదిలించింది. ఫ్రాన్స్ దర్శకుడు డియెగో సస్పెడెస్ తెరకెక్కించారు.
ఇక మన దేశం నుంచి ఈ ఏడాది ప్రధాన ప్రదర్శనకు ఎ చిత్రం సెలక్ట్ కానప్పటికీ అన్‌సర్టైన్ రిగార్డ్‌లో జాన్వీ, ఇషాన్ కట్టర్ మరోసారి జంటగా నటించిన ‘హోమ్ బౌండ్’ అనే చిత్రం ప్రదర్శితమై మెప్పించింది. ఎలాంటి పురస్కారం అయితే లభించలేదు. ఫ్రెంచ్ నటి జూలియట్ బినోచే.. భారతీయ దర్శకురాలు, ‘ఆల్ వియ్ ఇమాజిన్ ఆజ్ లైట్’ ఫేమ్ పాయల్ కపాడియా ఈ ఏడాది జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.
విజేతలు వీరే:
గోల్డెన్ పాల్మ్: ఇట్ వజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్ (జాఫర్ పనాహీ)
గ్రాండ్ ప్రిక్స్: ద సెంటిమెంటల్ వాల్యూ (జొవాచిమ్ ట్రైయర్)
ఉత్తమ దర్శకుడు: క్లెబర్ మెన్‌డోన్హా ఫిల్హో (ద సీక్రెట్ ఏజెంట్)
ఉత్తమ నటుడు: వాఘ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్)
ఉత్తమ నటి: నదియా మెలిటీ (ది లిటిల్ సిస్టర్)
అన్‌సర్టైన్ రిగార్డ్: మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో (డియెగో సస్పెడెస్)