F1 Movie: ఇండియాలో.. హాలీవుడ్ మూవీ అరాచ‌కం! బాక్సాఫీస్ రికార్డులు ఖ‌ల్లాస్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:29 PM

బ్రాడ్ పిట్ హీరోగా గ‌త నెల‌లో వ‌చ్చిన ఎఫ్ 1 చిత్రం ఇండియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

F1 MOVIE

ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న న‌టుడు బ్రాడ్ పిట్ (Brad Pitt). బేబీలాన్ (Babylon), బుల్లెట్ ట్రైన్(Bullet Train) వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ త‌ర్వాత‌ ఆయ‌న నుంచి వ‌స్తున్న కొత్త చిత్రం 'ఎఫ్ 1' (F1). స్పోర్ట్స్, యాక్ష‌న్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రెండేండ్ల క్రితం టామ్ క్రూజ్‌తో 'టాప్ గన్ : మేవరిక్' (Top Gun : Maverick) రూపొందించిన జోసెఫ్ కోసిన్ స్కీ (Joesph Kosinski) ఈ 'ఎఫ్ 1' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఓ రిటైర్డ్ రేసర్ సన్నీ హేస్ (Brad Pitt) తన స్నేహితుడైన రూబెన్ నిర్వ‌హిస్తున్న F1 టీమ్ APXGP తీవ్రంగా విఫ‌ల‌మ‌వ‌డం, న‌ష్టాల్లో కూరుకు పోతున్న స‌మ‌యంలో అత‌నికి హెల్ప్ చేయ‌డానికి రేసింగ్ ట్రాక్‌లోకి వ‌స్తాడు. అ క్ర‌మంలో జోషువ (Damson Idris) అనే యువ యువ రేసర్‌కు మెంటార్‌గా మారతాడు. ఆపై ఈ ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే డ్రామా, గ్రాండ్ ప్రిక్స్‌లో జరిగే రేసింగ్‌ల‌తో సాగుతూ ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లోకూర్చో పెడుతుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎమోషనల్ డ్రామా ఆక‌ట్టుకోవ‌డంతో పాటు రేసింగ్ విజువల్స్ అన్ని వ‌ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ‌నం నిజంగా రేస్ చూస్తున్నామ‌నే ఫీల్ రావ‌డంతో పాటు సన్నీ హేస్ క్యారెక్ట‌ర్ ను ఓన్ చేసుకుంటాం.

F1

ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ అయిన రోజు మొద‌లు నేటికి సుమారు నెల కావ‌స్తున్నా బాక్సాఫీస్ వ‌ద్ద స్ట‌డీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మ‌ధ్య‌లో జురాసిక్ వ‌రల్డ్‌, హౌ టు ట్రెయిన్ యువ‌ర్ డ్రాగ‌న్ వంటి భారీ చిత్రాలు వ‌చ్చినా F1 చిత్రం క‌లెక్ష‌న్లు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు ఇండియాలో సైతం రూ.100 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఓ స‌రికొత్త చ‌రిత్ర నెల‌కొల్పింది. ఇంకా చెప్పుకోవాలంటే ఒక్క హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐ మ్యాక్స్ లో ఈ ఒక్క సినిమాకే 50 వేల‌కు పైగా టికెట్లు తెగాయంటే ఇక్క‌డి వారు ఈ సినిమాను ఎలా ఆద‌రించారో, ఆద‌రిస్తున్నారో అర్థ‌మ‌వుతుంది.

మ‌న దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ మూవీ ఇంకా స‌క్సెస్‌ఫ‌ల్‌గా ర‌న్ అవుతుంది. సుమారు $300 మిలియ‌న్ డార్ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా $464 మిలియ‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసింది. అంటే మ‌న లెక్క‌ల్లో ₹3,851 కోట్లు కొల్ల‌గొట్టింది. అమెరికాలో ఈ మూవీ $155 మిలియ‌న్ డాల‌ర్ల‌ను, ఓవర్సీస్ లో $309 మిలియన్ డాల‌ర్ల‌ను రాబ‌ట్టింది. ఈ యేడు మ‌య్యెస్ట్ గ్రాసిగ్ చిత్రాల్లో టాప్‌10లోనూ చోటు సంపాదించుకుంది. ప్ర‌స్తుత‌ ప‌రిస్థితి చూస్తుంటే ఆగ‌ష్టు 15 వ‌ర‌కు ఈ సినిమా థియేట‌రిక‌ల్ చేయ‌డం గ్యారంటీగా క‌నిపిస్తుండ‌గా అగ‌ష్టు చివ‌ర‌లో ఓటీటీకి రానుంది. ఈ లోపు ఈ చిత్రం ఇంకా ఎన్ని అద్బుతాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

F1

Updated Date - Jul 23 , 2025 | 03:29 PM