F1 Main Trailer: బ్రాడ్ పిట్ ఎఫ్ 1 మెయిన్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - May 14 , 2025 | 06:20 AM

ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న న‌టుడు బ్రాడ్ పిట్. బేబీలాన్, బుల్లెట్ ట్రైన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ త‌ర్వాత‌ ఆయ‌న నుంచి వ‌స్తున్న కొత్త చిత్రం 'ఎఫ్ 1'.

F1 Main Trailer: బ్రాడ్ పిట్  ఎఫ్ 1  మెయిన్ ట్రైల‌ర్‌
F1 Main Trailer

ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న న‌టుడు బ్రాడ్ పిట్ (Brad Pitt). బేబీలాన్ (Babylon), బుల్లెట్ ట్రైన్(Bullet Train) వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ త‌ర్వాత‌ ఆయ‌న నుంచి వ‌స్తున్న కొత్త చిత్రం 'ఎఫ్ 1' (F1). స్పోర్ట్స్, యాక్ష‌న్‌జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్రోమోలు, టీజ‌ర్స్ అదిరిపోయే రెస్పాన్స్ తీసుకువ‌చ్చాయి. దీంతో సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

రిటైర్డ్ కార్ రేస‌ర్ ఓ కొత్త రేస‌ర్‌కు ట్రైనింగ్ ఇవ్వాల్సి రావ‌డం నేప‌థ్యంలో సినిమా రూపొందింది. రెండేండ్ల క్రితం టామ్ క్రూజ్‌తో 'టాప్ గన్ : మేవరిక్' (Top Gun : Maverick) రూపొందించిన జోసెఫ్ కోసిన్ స్కీ (Joesph Kosinski) ఈ 'ఎఫ్ 1' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమాను నుంచి తాజాగా మంగ‌ళ‌వారం మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు సైతం ప్రేక్ష‌కుల నుంచి మంచిస్పంద‌నే వ‌స్తుంది.

Updated Date - May 14 , 2025 | 03:01 PM